ప్యాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ లోకి కన్నడ యంగ్ స్టార్ రిషి

ఇవాళ్టి సినిమాకు భాషా హద్దులు, ప్రాంతీయ బేధాలు లేవు. రీజనల్ ఫిల్మ్స్ మాట చెరిగిపోయి ప్యాన్ ఇండియా సినిమాలు వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్...ఇలా తెలుగు స్టార్స్ అంతా కన్నడనాట సూపర్ స్టార్సే. అలాగే గతంలో ఉపేంద్ర నుంచి లెటెస్ట్ గా సుదీప్, యష్, దర్శన్, ధృవ్ సర్జా వరకు ఎంతోమంది శాండల్ వుడ్ హీరోలు తెలుగులో సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ ప్యాన్ ఇండియా ట్రెండ్ కు తగినట్లే తన కొత్త సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు శాండల్ వుడ్ యంగ్ స్టార్ రిషి.
బెంగళూరులో పుట్టి పెరిగిన రిషి...సివిల్ ఇంజినీరిగ్ పూర్తి చేసి నటన మీద ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టారు. 2013లో "మనీ హనీ షనీ" సినిమాతో తెరంగేట్రం చేసిన రిషి...2017లో "ఆపరేషన్ అలమేలమ్మ" చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తర్వాతి సినిమా "కవలుదారి" కూడా సూపర్ హిట్ అవడంతో యంగ్ స్టార్ గా కన్నడ చిత్ర పరిశ్రమలో అవతరించారు రిషి. ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్ నిర్మాతగా "సకల కళా వల్లభ" అనే సినిమాలో నటిస్తున్నారు రిషి. ఇలా తనకంటూ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న రిషి..ఇకపై ప్యాన్ ఇండియా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com