నటుడి భార్య మరణం.. కీటో డైటే కారణమా!

నటుడి భార్య మరణం.. కీటో డైటే కారణమా!
కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన మరణానికి కీటో డైట్, విపరీతమైన వ్యాయామం కారణంగా చెబుతున్నారు.

కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన మరణానికి కీటో డైట్, విపరీతమైన వ్యాయామం కారణంగా చెబుతున్నారు. స్పందన బ్యాంకాక్‌లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆమె బరువు తగ్గడం కోసం అనుసరించిన కీటో డైట్, విపరీతమైన వ్యాయామం ఆమె ఆరోగ్యంపై "ప్రతికూల ప్రభావాలు" చూపించి ఉంటాయనే చర్చ మొదలైంది.

బరువు తగ్గడం పట్ల విపరీతమైన ఒత్తిడి గుండెపోటుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధిక బరువుతో బాధపడుతున్న ఆమె 16 కిలోల బరువు తగ్గినప్పుడు చాలా ప్రశంసలు అందుకుంది. కానీ అది ఆమె గుండెపై ఒత్తిడికి కారణమైన విషయాన్ని గుర్తించలేకపోయింది. ఇప్పడు అదే ఆమె ప్రాణాలు పోవడానికి కారణమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఆమె ఒక కన్నడ చిత్రంలో నటించింది. అనేక రియాల్టీ షోలలో పాల్గొంది. భర్త విజయ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటించిన 'కిస్మత్' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది.

గతంలో, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించినప్పుడు కూడా తీవ్రమైన వ్యాయామమే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. విజయ రాఘవేంద్ర, స్పందన దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో మోడల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. సోమవారం, స్పందన బ్యాంకాక్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ పర్యటనకు వెళ్లిన స్పందన.. షాపింగ్ ముగించుకుని బంధువులతో కలిసి తన గదికి వచ్చి కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

Tags

Read MoreRead Less
Next Story