నటుడు వినాయక్‌ వివాహం.. వధువు ఎవరో తెలుసా?

నటుడు వినాయక్‌ వివాహం.. వధువు ఎవరో తెలుసా?
కన్నడ నటుడు వినాయక్‌ జోషి వివాహం చేసుకున్నారు. తన స్నేహితురాలు వర్షా బెలవాడితో ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు

కన్నడ యాక్టర్ వినాయక్ జోషి ఓ ఇంటివాడయ్యారు.. ఆయన చిరకాల స్నేహితురాలుతో కలిసి ఏడడుగులు వేశారు. వర్షా బెలవాడితో ఆర్య సమాజ్ లో వినాయక్ వివాహం జరిగింది.ఈ వివాహ వేడుకకు కేవలం అతికొద్దిమంది బంధువులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త జీవితానికి స్వాగతం పలికారు వినాయక్ దంపతులు. చిన్ననాటి నుంచి స్నేహితులు అయిన వినాయక్, వర్షా..

ఏడేళ్ల వయసులో వీరిద్దరు ఒకే చోట నృత్యం‌ నేర్చుకున్నారు. కొద్ది రోజుల తరువాత పరిస్థితుల ప్రభావంతో విడిపోయిన వీరిద్దరూ కొన్ని ఏళ్ల తర్వాత ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మళ్లీ కలుసుకొని ప్రేమలో పడ్డారు. కాగా దాదాపు 70 సినిమాల్లో నటించిన అమృతా వర్షిని, లాలి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక వర్షా జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహిం​చారు.

Tags

Read MoreRead Less
Next Story