తెలుగు సీరియల్స్‌లో క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్స్ ఎక్కడివారో తెలుసా?
వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అదే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ పాపులారిటీ ఉంటుంది. బుల్లితెరపై వస్తున్న సీరియల్స్ అన్నింటిలో ఇతర భాషల నుంచి వచ్చిన నటీమణులు తమ హవాను కొనసాగిస్తూన్నారు. వీరంతా ముఖ్యంగా కన్నడ నటీమణులకు తెలుగు ధారావహికల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. బుల్లితెర నటీమణుల అచ్చం తెలుగు అమ్మాయిల మాదిరిగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మరి కన్నడ నుంచి వచ్చి తెలుగులో పేరు పొందిన ఆ నటీమణులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
జానకి కలగనలేదు హీరోయిన్ ప్రియాంక, బంగారు పంజరం హీరోయిన్ నిఖిత, అమ్మ నా కోడలా హీరోయిన్ నిత్య..
కోయిలమ్మ హీరోయిన్ కావ్య శ్రీ, చైత్ర రాయ్ రామ చక్కని సీత హీరోయిన్ నవ్య వంటి వారు కూడా కన్నడ భాష నుంచి వచ్చి తెలుగులో వివిధ సీరియల్స్ లో నటిస్తూ మంచి ఆదరణ దక్కించుకున్నారని చెప్పవచ్చు.
నా పేరు మీనాక్షి నవ్య స్వామి, కార్తీకదీపం మోనిత అలియాస్ శోభా శెట్టి, కల్యాణ వైభోగమే సీరియల్ హీరోయిన్ మేఘన లోకేష్, కేరాఫ్ అనసూయ హీరోయిన్ తేజస్వినీ, గుప్పెడంత మనసు హీరోయిన్ రక్షా గౌడ, కస్తూరి ఐశ్వర్య,
గుండమ్మ కథ పూజ మూర్తి, బంగారు గాజులు నక్షత్ర వీరందరూ కూడా కన్నడ భాష నుంచి వచ్చి తెలుగులో తమ సత్తాను చాటుకుంటున్న తెలుగు వారిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com