Rukmini Vasanth : ఎన్టీఆర్ మూవీలో "సాగరాలు" బ్యూటీ

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ బంపర్ ఆఫర్ కొట్టేసిందా అంటే అవుననే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అది కూడా ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో. ప్రస్తుతం అయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. సప్తసాగరాలు దాటి అనే సినిమాతో రుక్మిణికి సౌత్ లో మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఎన్టీఆర్ సినిమా కోసం రుక్మిణిని ఫైనల్ చేశేశారట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com