బతికే అవకాశాలు 50% మాత్రమే అన్నారు.. అయినా అతడు నన్ను..: ప్రియాంక కామత్

బతికే అవకాశాలు 50% మాత్రమే అన్నారు.. అయినా అతడు నన్ను..: ప్రియాంక కామత్
X
'మజా భారత్', 'గిచ్చి గిలిగిలి' రియాల్టీ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రియాంక కామత్, ప్రేమించిన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకోవాలనుకుంది.

'మజా భారత్', 'గిచ్చి గిలిగిలి' రియాల్టీ షోలలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రియాంక కామత్, ప్రేమించిన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకోవాలనుకుంది. కానీ విధి మరోలా ఆలోచించింది. ఆ సమయంలో తీవ్ర అనారోగ్యం.. రెండు సార్లు సర్జరీలు చేయించుకోవాలల్సిన పరిస్థితి వచ్చింది. 8 నెలలుగా నడవడానికి ఇబ్బంది పడుతున్న ప్రియాంకకు, ప్రేమించన వ్యక్తే అండగా నిలబడ్డాడు.. అన్నీ తానై చూసుకున్నాడు.. ఏ జన్మదో ఈ బంధమూ అని ప్రియాంక అతడికి కన్నీటితోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ విషయాన్ని ప్రియాంక ఓ వీడియో ద్వారా తెలిపారు.

ఏ వ్యక్తి జీవితంలో అయినా ప్రేమ మొదలైనప్పుడే కొత్త జీవితం మొదలవుతుంది. "గత సంవత్సరం, నేను మరియు అమిత్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. కానీ అనుకోని ఉపద్రవం.. నాకు అనారోగ్యం, శరీరం సహకరించలేదు.. కొన్ని రోజుల తర్వాత, నేను నడవలేకపోయాను.. కనీసం కూర్చుందామంటే కూడా కష్టంగా అనిపించేది. ఈ క్రమంలోనే నాకు 2 శస్త్రచికిత్సలు జరిగాయి, నేను బతికే అవకాశం 50% మాత్రమే ఉందన్నారు డాక్టర్లు. నా శరీరంలో స్క్రూలు, స్టీల్ రాడ్లు ఉన్నాయి. ఆ సమయంలో నేను అమిత్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాను. కానీ అతను నన్ను విడిచిపెట్టలేదు. దుస్తులు ధరించడం నుండి డైపర్ ప్యాడ్స్ మార్చే వరకు అమిత్ నాకు సహాయం చేశాడు" అని ప్రియాంక కామత్ వీడియోలో పేర్కొంది.

"నేను 8 నెలలు మంచం మీద ఉన్నాను. ఆ తర్వాత నేను కోలుకోవడం మొదలుపెట్టాను. తర్వాత నేను నడవడం ప్రారంభించాను. అమిత్ నాపై ఆశలు వదులుకోకుండా ఉంచాడు. అలా కొన్ని నెలల తర్వాత మా నిశ్చితార్థం జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్‌లో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. అమిత్ ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నాను అని మాటల ద్వారా చెప్పలేదు. కానీ అతను తన పని ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు అని ప్రియాంక చెప్పారు.

“మొదటి సర్జరీ అయ్యాక కోలుకుంటానని అనుకున్నాను. కానీ నొప్పి మరింత ఎక్కువయ్యింది. భరించలేని బాధ. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఏడవని నేను, ఆ బాధ భరించలేక ఏడ్చేదాన్ని. రెండోసారి మళ్లీ హాస్పిటల్‌లో చేర్చాను. నొప్పి తగ్గాలని పెయిన్‌కిల్లర్ మాత్రలు వేసుకున్నాను. అయినా నొప్పి తగ్గలేదు. నా బాధను అమ్మ అర్థం చేసుకునేది.

పిల్లలను ఆదుకునే తల్లులందరికీ ఈ పోస్ట్ అంకితం చేస్తున్నాను. మనం బావున్నప్పుడు చాలా మంది వస్తారు, పలకరిస్తారు.. కానీ బాధలో ఉన్నప్పుడు కుటుంబం మాత్రమే వస్తుంది. నన్ను చూసుకోవడానికి అమ్మ ప్రతిదీ త్యాగం చేసింది. అమిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితం మాకు పరీక్షపెట్టింది. నిజమైన ప్రేమకు అర్థం తెలిపింది. ఇప్పుడు మేమిద్దరం సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తున్నాము. చాలా కష్టమైన సమయాల్లో కూడా అతడు నాతో ఉన్నాడు.

అమిత్ నాయక్ స్వస్థలం కుందాపూర్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అమిత్, ప్రియాంక ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. మంగళూరుకు చెందిన ప్రియాంక కామత్ 'ఛాంపియన్‌' అనే రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత కామెడీ రియాల్టీ షోలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది.

Tags

Next Story