కరోనాతో నటి మాలాశ్రీ భర్త మృతి..!

కరోనాతో నటి మాలాశ్రీ భర్త మృతి..!
సినీ నిర్మాత, నటి మాలాశ్రీ భర్త రాము(52) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న అయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయింత్రం మృతి చెందారు.

సినీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నిర్మాత, నటి మాలాశ్రీ భర్త రాము(52) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న అయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయింత్రం మృతి చెందారు. ఆయన మృతి పట్ల కన్నడ చిత్రపరిశ్రమతోపాటుగా ఇతర సినీ పరిశ్రమలూ కూడా దిగ్ర్భాంతిని వ్యక్తం చేశాయి. ఎ.కె.47, గంగ, కలాసిపాళ్య, ఆటో శంకర్‌, ఎలక్షన్‌, చాముండి, కంఠీవర మొదలగు చిత్రాలకి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. కన్నడ ఇండస్ట్రీలో ఆయనను కోటి రాము అని పేరుంది. కాగా 1990ల కాలంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story