Shivarajkumar : ఎన్టీఆర్ ఆ రోజు ఆ మాట అన్నాడు.. గుర్తుచేసుకున్న శివరాజ్‌కుమార్..!

Shivarajkumar : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం అందరిని షాక్‌కు గురిచేసింది.. ఆయన మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణం కేవలం ఆయన కుటుంబ సభ్యులనే కాదు కన్నడిగులను, భారత సినీ పరిశ్రమ సైతం విషాదంలోకి నెట్టింది. ఆయనని చివరిసారిగా చూసేందుకు అభిమానులతో పాటుగా సినీ సెలబ్రిటీలు కూడా వచ్చారు. పునీత్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకి నివాళులు అర్పించారు.
అందులో భాగంగానే టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కూడా బెంగుళూరు వెళ్లి తన స్నేహితుడైన పునీత్‌ను చివరిసారిగా చూసి నివాళులు అర్పించి, పునీత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే ఆ సందర్భంలో పునీత్ కుటుంబానికి 'మీకు నేను ఉన్నా అన్న' అంటూ దైర్యం చెప్పారని పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య, కన్నడ హీరో శివరాజ్‌కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పునీత్ మరణం తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. పునీత్ అకాల మరణంతో తమ కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
కాగా పునీత్ రాజ్‌కుమార్, ఎన్టీఆర్ మంచి స్నేహుతులన్న సంగతి అందరికి తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ కోసం ఎన్టీఆర్ ఆయన సినిమాలో ఒక పాట పాడారు కూడా.. ఇక పలు సందర్బాలలో కూడా ఎన్టీఆర్ తనకి బ్రదర్ లాంటివాడని పునీత్ కూడా చెప్పుకొచ్చారు. అటు పునీత్ గత నెల అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. అభిమానులు,కుటుంబ సభ్యుల సమక్షంలో కంఠీరవ స్టేడియంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
"నేనున్నాను అన్నా మీకు" - ఎన్.టి.ఆర్
— Milagro Movies (@MilagroMovies) November 11, 2021
శివరాజ్ కుమార్ @NimmaShivanna
గారిని పరామర్శించిన ఎన్.టి.ఆర్@tarak9999 @PuneethRajkumar pic.twitter.com/Qijeqlagc9
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com