Rashmika Mandana: ఎక్కడి నుంచి వచ్చిందీ మర్చిపోతే ఎలా: రష్మికపై కన్నడిగుల ఆగ్రహం

Rashmika Mandana: ఎక్కడి నుంచి వచ్చిందీ మర్చిపోతే ఎలా: రష్మికపై కన్నడిగుల ఆగ్రహం
Rashmika Mandana:

Rashmika Mandana: రష్మిక మందన్నా.. చాలా త్వరగా ఫేమ్ అయ్యింది. అంతే త్వరగా నేషనల్ క్రష్ అనిపించుకుంది. టాలీవుడ్ లో టాప్ రేస్ లో ఉన్న ఈ కన్నడ సోయగం.. బాలీవుడ్ లోనూ వరుసగా మూవీస్ చేస్తూ బిజిబిజీగా ఉంది.


కన్నడలో తెలుగు హ్యాపీడేస్ రేంజ్ లో చెప్పుకునే సినిమా కిరిక్ పార్టీ. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీతోనే రష్మిక మందన్నా హీరోయిన్ గా పరిచయం అయింది. అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఏకంగా ఎంగేజ్మెంట్ వరకూ వెళ్లింది.



అయితే తెలుగులో చేసిన ఛలో హిట్ కాగానే అమ్మడు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. అప్పట్లోనే చాలామంది విమర్శించారు కూడా. తను అవేవీ పట్టించుకోకుండా తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. గీత గోవిందం టైమ్ లో విజయ్ దేవరకొండతో చేసిన రొమాన్స్ సైతం హాట్ టాపిక్ అయింది.


తనను హీరోయిన్ గా పరిచయం చేసిన రిషభ్ శెట్టి లేటెస్ట్ మూవీ కాంతార దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. వెరీ జెన్యూన్ బ్లాక్ బస్టర్ గా బిగ్గెస్ట్ కమర్సియల్ హిట్ గానూ నిలిచింది. దీంతో ఈ మూవీ గురించి రష్మికను అడిగితే తను ఆ సినిమా చూడలేదు అని సమాధానం చెప్పి షాక్ ఇచ్చింది.



అంతేకాక హీరోయిన్ గా తన ఫస్ట్ ఆఫర్ గురించి అడినప్పుడు కూడా డైరెక్టర్ తో పాటు బ్యానర్ పేరును వదిలేసి ఆన్సర్ చేసింది. అమెరికాలో ఇండియన్ సినిమాల సెన్సార్ బోర్డు మెంబర్, ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



కన్నడకు చెందిన అమ్మాయి అయివుండి.. శాండల్ వుడ్ కు రష్మిక సరైన గౌరవం ఇవ్వకపోవడంతో పాటు అవమానపర్చేలా మాట్లాడుతున్నందున ఆమెను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేసినట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story