Kannada Star Sivanna : ఆపరేషన్ సక్సెస్.. కోలుకున్న శివన్న

Kannada Star Sivanna :  ఆపరేషన్ సక్సెస్.. కోలుకున్న శివన్న
X

కన్నడ టాప్ స్టార్ శివరాజ్ కుమార్ కు రీసెంట్ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పే వరకూ చాలామందికి తెలియలేదు. ఆ మధ్య తన వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళుతున్న సందర్భంగా ఈ విషయాన్ని చెప్పి సర్జరీకి వెళుతున్నా అన్నాడు. అంతే.. అసలే పునీత్ రాజ్ కుమార్ ను కోల్పోయిన ఫ్యాన్స్ శివన్నకు ఏమైనా అవుతుందేమో అని విపరీతంగా ఆందోళన చెందారు. ఆయనకేమీ కాకూడదని.. క్షేమంగా తిరిగి రావాలని ఎన్నో పూజలు చేశారు. అవన్నీ ఫలించాయి. శివన్న సర్జరీ విజయవంతం అయింది. తాజాగా ఇంటికి వచ్చారు కూడా.

ఈ సందర్భంగా ఆయన భార్యతో కలిసి అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. తన సర్జరీ విజయవంతం అయిందని.. ఇంకేం కాదనీ.. మునుపటి లాగానే సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్లూ చేయొచ్చని డాక్టర్లు చెప్పారని.. అంచేత అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశాడు. ఇదే సమయంలో తన వ్యాధి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారనీ.. తన రెండు కిడ్నీలూ పాడైపోయాయి అని కొన్ని మీడియా సంస్థల్లో వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నాడు. యూరిన్ బ్లాడర్ లోనే చిన్న ఇబ్బంది ఉందని దానికే చికిత్స జరిగిందని వివరణ ఇచ్చాడు.

మొత్తంగా శివన్న ఆరోగ్యంగా తిరిగి రావడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే శాండల్ వుడ్ అంతా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

ప్రస్తుతం శివరాజ్ కుమార్ మూడు కన్నడ సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే ఇవి పూర్తి కాబోతున్నాయి. అలాగే తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న సినిమాతో పాటు తమిళ్ లో విజయ్ చివరి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. సో.. ఆయనిప్పుడు కోలుకున్నారు కాబట్టి.. ఈచిత్రాలకు ఇక ఏ ఇబ్బందీ లేదు అనుకోవచ్చు.

Tags

Next Story