సినిమా

Chethana Raj : ప్రాణం తీసిన ప్లాస్టిక్ సర్జరీ.. కన్నడ నటి మృతి..!

Chethana Raj : కన్నడ టీవీ నటి చేతనా రాజ్ (21) కన్నుమూసింది.. కాస్మోటిక్ సర్జరీ వల్లే ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది.

Chethana Raj :  ప్రాణం తీసిన ప్లాస్టిక్ సర్జరీ.. కన్నడ నటి మృతి..!
X

Chethana Raj : కన్నడ టీవీ నటి చేతనా రాజ్ (21) కన్నుమూసింది.. కాస్మోటిక్ సర్జరీ వల్లే ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది. నిన్న(మే 16)న బెంగుళూరులోని శెట్టి సౌందర్య ఆసుపత్రిలో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ప్యాట్ ఫ్రీ సర్జరీ కోసం కాస్మొటిక్ సర్జరీని చేతనా ఆశ్రయించినట్లు సమాచారం. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు బాగా చేరడంతో ఆమె ఇబ్బంది పడిందట. డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్ లోని కడే హాస్పిటల్‌కు తరలించారు. సరైన వైద్య పరికరాలు లేకుండా సర్జరీ చేసేందుకు తమ కూతురు చనిపోయిందని చేతనా తల్లీదండ్రులు ఆరోపిస్తున్నారు. చేతనా మృతదేహాన్ని ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంచగా, పోస్ట్‌మార్టం నిమిత్తం రేపు ఉదయం రామయ్య ఆసుపత్రికి తరలించనున్నారు. కాగా చేతనా కన్నడలోని పలు సీరియల్స్ మరియు సినిమాల్లో నటించింది.

Next Story

RELATED STORIES