Kantara : 'వరాహ రూపం' పాటకు 'సుప్రీం' సడలింపు

'కాంతార' సినిమాలో 'వరాహ రూపం పాట'ను వాడుకోరాదన్న కేరళ హైకోర్టు విధించిన షరతును సుప్రీం కోర్టు సడలించింది. ఈ తీర్పు 'కాంతార' నిర్మాత విజయ్ కిర్గందూర్, నటుడు రిషబ్ షెట్టికి ఉపశమనాన్ని ఇచ్చింది. ఇరువురిని పోలీసులు విచారించవచ్చని, అరెస్ట్ చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. సినిమా నుంచి పాటను పూర్తిగా తొలగించాలన్న షరతుపై 'సుప్రీం కోర్టు' స్టే ఇవ్వడంతో చిత్ర యునిట్ ఊపిరి పీల్చుకుంది.
పిటిషనర్ 12, 13 ఫిబ్రవరి 2023న దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సంగీత యాజమాన్యాన్ని క్లైమ్ చేసినందుకు సదరు బ్యాండ్ 'తైకుడం బ్రిడ్జి' కి నోటీసులు జారీ చేసింది. చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించాలని కేరళ హైకోర్టును కోరింది. పిటిషనర్ విచారణకు హాజరైనప్పుడు నటుడు రిషబ్ షెట్టిని, నిర్మాత విజయ్ కిర్గందూర్ ను అరెస్ట్ చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com