Kantara 2 : నవంబర్ లో సెట్స్ పైకి.. 2024లో రిలీజ్

Kantara 2 : నవంబర్ లో సెట్స్ పైకి.. 2024లో రిలీజ్
'కాంతార 2'పై క్రేజీ అప్ డేట్.. మరింత ఆలస్యంగా రిలీజ్ కానున్న ప్రీక్వెల్

హోంబలే ఫిలింస్ నిర్మించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ 'కాంతార' గత సంవత్సరం భారతీయ సినిమాలో అతిపెద్ద స్లీపర్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ఈ సినిమాలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి పాన్-ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కింది. థియేటర్లలో 100-రోజుల రన్‌ను గుర్తుచేసుకుంటూ, మేకర్స్ దీని రెండవ భాగాన్ని ఫిబ్రవరి 2023లో ప్రకటించారు. అప్పటి నుండి, 'కాంతార 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కన్నడ బిగ్గీకి సంబంధించిన అద్భుతమైన అప్‌డేట్ వైరల్ అవుతోంది.

'కాంతార 2' నవంబర్ 2023లో సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఈ షూటింగ్ టైమ్‌లైన్‌లను లాక్ చేశారని, నవంబర్ 1 న మొదటి షెడ్యూల్‌ను ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. "రిషబ్ శెట్టి, అతని బృందం రచనను పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనుల్లో మునిగిపోయారు. మొదటి భాగాన్ని శెట్టి తన స్వస్థలమైన కుందాపురలో చిత్రీకరించారు. 'కాంతార 2' ఎక్కువగా మంగళూరులో చిత్రీకరించబడుతుంది. ఈ ప్రదేశంలో అవసరమైన అడవి, భూమి వంటి అంశాలు ఉంటాయి. ఈ చిత్రం బడ్జెట్‌లో పెద్దది. నాలుగు నెలల షెడ్యూల్‌లో భారీ స్థాయిలో చిత్రీకరించబడుతుంది" అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే మేకర్స్ షూటింగ్‌ని త్వరతగతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి, 2024 చివరిలో ఈ సినిమాను థియేటర్‌లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

'కాంతార 2' అనేది మొదటి భాగంలో కనిపించే జానపద కథల నేపథ్యాన్ని అన్వేషించే ప్రీక్వెల్ గా రాబోతోంది. హైపర్-లోకల్ కథ దేవత, పంజుర్లీ దైవంల మూలాన్ని పరిశీలిస్తుంది. అందుకోసం రిషబ్, అతని బృందం రెండు నెలలుగా కోస్తా కర్నాటక అడవులకు వెళ్లి పరిశోధనలు చేసింది. ఈ రాబోయే భాగంతో ప్రేక్షకులకు అసమానమైన సినిమా అనుభవాలను అందించడానికి టీమ్ కఠినంగా సిద్ధమవుతోంది. 'కాంతార 2'కు సంబంధించిన టైటిల్ పోస్టర్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

'కాంతార' తీరప్రాంత కర్నాటక సంప్రదాయ పద్ధతులలో డీప్ గా పాతుకుపోయింది. స్థానిక దేవతచే రక్షించబడిన గ్రామస్థుల సమూహం మధ్య సంఘర్షణ, భూమిని ప్రభుత్వానికి క్లెయిమ్ చేయడానికి అటవీ శాఖ చేసిన ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో రిషబ్ శెట్టి ద్విపాత్రాభినయం చేశారు-కంబాల ఛాంపియన్ శివగా, అతని తండ్రి, దైవ కోలా ప్రదర్శనకారుడిగా. అతను ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. ఇందులో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి తదితరులు నటించారు. దీని ప్రీక్వెల్, 'కాంతార 2', ప్రామాణికతను చెక్కుచెదరకుండా ఉంచుతూ, మొదటి భాగానికి సమానమైన శైలితో తెరకెక్కుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story