కాంతార 1కు రికార్డ్ స్థాయి ఓటిటి డీల్

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కాంతార : చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాంతార దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో ఈ కాంతార చాప్టర్ 1పై భారీ అంచనాలున్నాయి. ఈ సారి బిగ్ బడ్జెట్ కూడా తోడైంది కాబట్టి విజువల్ గ్రాండీయర్ గానూ కనిపిస్తుంది. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఈ మూవీకి మంచి బిజినెస్ జరుగుతోంది. అంచనాలను బట్టి వాళ్లూ ఏ మాత్రం తగ్గడం లేదు. భారీ రేట్లే చెబుతున్నారు. ఆయా మార్కెట్స్ స్ట్రాటజీస్ ను బట్టి కొనేస్తున్నారు బయ్యర్స్.
అయితే ఈ మూవీ ఓటిటి డీల్ భారీ ధరకు పూర్తి కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని 125 కోట్లకు కొనగోలు చేసింది. కన్నడ నిన్నా మొన్నటి వరకు కేవలం 5 కోట్ల రెమ్యూనరేషన్ హీరోగానే ఉన్న రిషబ్ మూవీకి ఈ రేంజ్ రేట్ అంటే చాలా పెద్ద అమౌంట్ అనే అనుకోవాలి. అందుకే ప్రస్తతం కాంతార చాప్టర్ 1 ఓటిటి డీల్ హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా కంటెంట్ మహిమే అని మరోసారి ఈ డీల్ ప్రూవ్ చేస్తుందని కామెంట్ చేస్తున్నారు చాలామంది.
రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. ఏదేమైనా దసరా బరిలో ఉన్న ఈ మూవీ మరోసారి దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ లను షేక్ చేయడం ఖాయం అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com