Kantara Chapter 1: బీభత్సమైన లుక్ లో రిషబ్ శెట్టి

'కాంతార' చాప్టర్ 1.. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన 2022 యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కాంతారకి ప్రీక్వెల్ చిత్రం. తాజాగా ఈ చిత్రం నుండి అధికారిక ఫస్ట్ లుక్ వచ్చింది. మొదటి చిత్రం థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విమర్శకుల నుండి భారీ సానుకూల స్పందనలను అందుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం 'కాంతార' చాప్టర్ 1 ఫస్ట్ లుక్ ను ఈరోజు కర్నాటకలోని కుందపురాలోని చారిత్రక దేవాలయంలో విడుదలైంది. ప్రీక్వెల్ చిత్రం 301-400 AD కాలంలో ఉండే పంజుర్లీ దైవం మూలాన్ని తిరిగి కనుగొనవచ్చు. మొదటి సినిమాలాగే, కాంతార చాప్టర్ 1కు రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించాడు.
Step into the land of the divine 🔥
— Hombale Films (@hombalefilms) November 27, 2023
Presenting #KantaraChapter1 First Look & #Kantara1Teaser in 7 languages❤️🔥
▶️ https://t.co/GFZnkCg4BZ#Kantara1FirstLook #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @AJANEESHB @Banglan16034849 @KantaraFilm pic.twitter.com/2GmVyrdLFK
చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా ఓ సంచలనం క్రియేట్ చేసింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఓ రేంజ్‌లో వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. చెప్పాలంటే రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. 2022 అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కాంతార 2' వస్తో్న్న సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను వదిలింది టీమ్. టీజర్ మాత్రం అదిరే విజువల్స్‌తో కేక పెట్టిస్తోంది. రిషబ్ శెట్టి ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా ఏడు భారతీయ భాషాల్లో విడుదలకానుందని తెలిపింది టీమ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com