KantaraChapter1 : కాంతార చాప్టర్ 1ను కేరళలో బ్యాన్ చేశారా..?

ఈ దశాబ్ధంలో అత్యంత అనూహ్యంగా అతి పెద్ద విజయం సాధించిన సినిమా ఏదైనా ఉందంటే.. అది కాంతార. కన్నడ నుంచి వచ్చిన ఈ మూవీ రివ్యూస్ తోనే ఇతర భాషల్లోకి డబ్ అయింది. డబ్ అయిన ప్రతి చోటా బాక్సాఫీస్ ను షేక్ చేసింది కాంతార. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల వరకూ వసూళ్లు సాధించి ట్రేడ్ కే షాక్ ఇచ్చింది. కాంతార బడ్జెట్ కేవలం 20 కోట్ల లోపే. కానీ ఈ మూవీ సాధించిన విజయం వల్ల ఇప్పుడు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్నారు. మళ్లీ రిషబ్ శెట్టినే డైరెక్ట్ చేస్తున్నాడు. కాంతార చాప్టర్1 పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు. రిలీజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ చిత్రాన్ని కేరళలో బ్యాన్ చేశారు అనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. మరి నిజంగా ఈ మూవీ కేరళలో బ్యాన్ అవుతోందా.. అసలేం జరిగింది..?
కాంతార చాప్టర్ 1 కేరళలో బ్యాన్ చేశారు అనే వార్తలో పూర్తిగా నిజం లేదు. ఈ చిత్రం రాష్ట్రం మొత్తం బ్యాన్ కాలేదు. అసలు ఏం జరిగిందంటే.. కేరళలో రెవిన్యూ షేరింగ్ విధానంలో తేడాలు ఉన్నాయని అక్కడి ఎగ్జిబిటర్స్ లో మెజారిటీ మెంబర్స్ అంతా కలిసి ఒక యూనియన్ ను ఫామ్ చేశారు. దీని పేరు FEUOK. అంటే ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ అని అర్థం. వీళ్లకు కాంతార 1 వారికి మధ్య రెవిన్యూ షేరింగ్ విధానంలో తేడాలు వచ్చాయి. దీంతో సినిమాను బ్యాన్ చేస్తున్నారు అనే ప్రచారం జరిగింది. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే కేరళలోని థియేటర్స్ మొత్తం కేవలం వీరి చేతిలోనే లేవు. వీళ్లు వద్దు అనుకుంటే తమ థియేటర్స్ లో సినిమాను ప్రదర్శించరు. కానీ అక్కడ ఇంకా ఆశీర్వాద్ సినిమాస్, మ్యాజిక్ ఫ్రేమ్స్ వంటి పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి. వీరు FEUOK లో భాగం కాదు. సో.. కాంతార 1 ను వీరిలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసినా కేరళలో చూడొచ్చు. వీరే కాక ఇంకా FEUOK భాగం కాని సెంట్రల్ థియేటర్స్, నేషనల్ మల్టీ ప్లెక్స్ చైన్స్, ఇండిపెండెంట్ థియేటర్స్ ఉన్నాయి. సో.. వీరిలో ఎవరైనా కాంతార 1 ను ప్రదర్శించొచ్చు. అందుకే బ్యాన్ అనే మాటే తలెత్తదు. అదీ కాక FEUOKతో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఏ మూమెంట్ లో అయినా సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి. సో.. కాంతార చాప్టర్ 1 కేరళలో బ్యానర్ అవుతుందీ అనేది కేవలం ఊహాగానం మాత్రమే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com