Kantara: Chapter 1 : కాంతార డిమాండ్స్.. మండిపడుతున్న బాలీవుడ్

కాంతార బ్లాక్ బస్టర్ కావడంతో, ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 చిత్రానికీ తిరుగులేని డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ వల్లే ఆ నిర్మాతలు అన్ని భాషల్లోనూ భారీగా డబ్బింగ్ రైట్స్ ను డిమాండ్ చేశారు. సినిమాకు క్రేజ్ ఉండటంతో డబ్బింగ్ రైట్స్ కూ భారీగా పోటీ వచ్చింది. ఫైనల్ గా కాంతార 1 నిర్మాతలు అనుకున్నదే సాధించారు. మరి ఈ మొత్తం వసూలు చేయాలంటే ఆయా భాషల డిస్ట్రిబ్యూటర్స్ కు అంత సులువేం కాదు. అందుకే సొంత భాషా చిత్రాలను కూడా పట్టించుకోకుండా కాంతార చాప్టర్ 1 కే అన్ని థియేటర్స్, అన్ని షోస్ కేటాయించాలని హిందీలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న ఏఏ ఫిల్మ్స్ వాళ్లు తమ ఎగ్జిబిటర్స్ అందరికీ ఓ మెయిల్ పెట్టారంట.
ఆ మెయిల్ సారాంశం ఏంటంటే.. తమ సినిమాకు ఏ పోటీ ఉండొద్దు అని. సింగిల్ స్క్రీన్స్, 2 స్క్రీన్స్, 3 స్క్రీన్స్ ఉన్న థియేటర్స్ లో కాంతార 1తో పాటు మరే చిత్రాన్నీ ప్రదర్శించొద్దు అని డిమాండ్ చేశారు ఆ మెయిల్ లో. విశేషం ఏంటంటే.. మల్టీ ప్లెక్స్ అని చెప్పే అవకాశం ఉన్న 3 స్క్రీన్ థియేటర్స్ లో తమకు 18 షోలూ కేటాయించాలని అడుగుతున్నారు. అంటే అన్ని షోస్ కాంతారకే ఇవ్వాలని చెప్పడం అన్నమాట. అలాగే 4 స్క్రీన్ థియేటర్స్ లో21 షోస్, 5 స్క్రీన్ థియేటర్స్ లో27 షోస్, 6 స్క్రీన్స్ లో 30, 7 స్క్రీన్స్ లో 36, 8 స్క్రీన్స్ లో 42, 9 స్క్రీన్స్ లో 48,10 స్క్రీన్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో54 షోస్ తమకే ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. ఓ రకంగా తమ సినిమాతో పాటు మరే సినిమాకూ థియేటర్స్ ను షేర్ చేయొద్దు అని డైరెక్ట్ గానే మెయిల్ చేశారు.
అయితే కాంతార విడుదలవుతోన్న అక్టోబర్ 2నే బాలీవుడ్ నుంచి 'సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి'అనే చిత్రం విడుదలవుతోంది. జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సాన్య మల్హోత్రా, రోహిత్ సరఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేశాడు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ క సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మంచి ఫన్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనుకున్నారు అక్కడి ఆడియన్స్. సో.. ఇన్ డైరెక్ట్ గా ఈ చిత్రానికి ఇచ్చే థియేటర్స్ కూడా మాకే ఇవ్వాలనేది కాంతార చాప్టర్ 1 డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ అన్నమాట. ఈ డిమాండ్ పై బాలీవుడ్ వర్గాలు మండి పడుతున్నారు. అర్థం లేని డిమాండ్ ఇది అని సదరు డిస్ట్రిబ్యూటర్స్ ను ఏకేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై బాలీవుడ్ లో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. పరభాషా చిత్రాల కోసం సొంత భాష చిత్రాలను చంపేసుకుంటారా అని ఆడియన్స్ నుంచి సైతం విమర్శలు వస్తుండటం విశేషం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com