Karan Johar : "కాఫీ విత్ కరణ్" ఇక పై ఉండదు : కరణ్ జోహార్

Karan Johar : దేశవ్యాప్తంగా 'కాఫీ విత్ కరణ్' అనే టాక్ షో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.. ఇప్పటివరకూ ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో.. త్వరలో ఏడో సీజన్‌తో ముందుకు రాబోతోందని, ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ కి ఇటీవలే పెళ్లి చేసుకున్న కొత్త జంట అలియా భట్, రణబీర్ కపూర్‌లు మొదటి అతిధులుగా వస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ షోకి ఇన్నిరోజులు హోస్ట్‌గా వ్యవహరించిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఊహించని షాక్ ఇచ్చాడు.
ఇక ఫై ఈ టాక్ షో ప్రసారం కాదని స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నట్టుగా వెల్లడించాడు. "హలో, కాఫీ విత్ కరణ్ 6 సీజన్‌లుగా నా జీవితంలో మరియు మీ జీవితంలో ఒక భాగమైంది. పాప్ సంస్కృతి చరిత్రలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నామని మరియు మేము ప్రభావం చూపామని నేను అనుకుంటున్నాను. కాఫీ విత్ కరణ్ ఇక తిరిగి రాదని బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నాను" అంటూ రాసుకొచ్చాడు.
కాఫీ విత్ కరణ్ టాక్ షో మొదటి సీజన్ 2004లో మొదలైంది.. ఈ షోకి షారుఖ్ ఖాన్ , కాజోల్ ఫస్ట్ గెస్ట్ లుగా వచ్చారు.. సుమారు 15 సంవత్సరాల పాటు నడిచిన ఈ షోకి సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ట్వింకిల్ ఖన్నా, రాణి ముఖర్జీ, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, ఏక్తా కపూర్జాన్ అబ్రహం, లారా దత్తా వంటి ఎంతోమంది ప్రముఖులు అతిథులుగా వచ్చారు. ఈ షో చివరి సీజన్ 2019లో ప్రసారం అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com