Karan Johar : మోస్ట్ వయొలెంట్ డైరెక్టర్ కి కరణ్ పిలుపు

Karan Johar :  మోస్ట్ వయొలెంట్  డైరెక్టర్ కి కరణ్ పిలుపు
X

ఈ యేడాది ఆరంభంలోనే తెలుగు ప్రేక్షకులు చూసిన అత్యంత హింసాత్మక సినిమా మార్కో. ఈ రేంజ్ వయొలెన్స్ మన సినిమాల్లో ఎప్పుడూ లేదు. ఆ మాటకొస్తే దక్షిణాదిలోనే ఎప్పుడూ లేదు. మళయాలంలో రూపొందిన ఈ చిత్రం అక్కడ గత డిసెంబర్ లోనే రిలీజ్ అయినా తెలుగులో జనవరి 1న వదిలారు. ఆ హింస చూసి మనవాళ్లు జడుసుకున్నారు కూడా. బట్ కంటెంట్ పరంగా ఓకే అనిపించుకుంది. దీంతో మాలీవుడ్ లో భారీ విజయం సాధించింది. తెలుగులోనూ కమర్షియల్ గా వర్కవుట్ అయిందన్నారు. ఉన్ని ముకుందన్ హీరోగా యుక్తి తరేజా, సిద్ధిఖీ, జగదీష్, కబీర్ సింగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని హనీఫ్ అదేనీ డైరెక్ట్ చేశాడు. ఈ దర్శకుడికే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నుంచి పిలుపు వచ్చింది.

హనీఫ్ డైరెక్షన్ లో కరణ్ జోహార్ ఓ భారీ చిత్రం నిర్మించబోతున్నాడు. ఈ మూవీనే ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్స్ అయ్యాయి. అయితే హీరోతో పాటు కథేంటీ అనేది ఇంకా తేలలేదు. అయితే ఈ చిత్రాన్ని కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే రూపొందించబోతున్నారట. ప్యాన్ ఇండియా స్థాయిలో ఆర్టిస్టులను కూడా తీసుకుంటారని టాక్ ఉంది. మొత్తంగా హనీఫ్ అదేని బాలీవుడ్ బిగ్గీ అయిన కరణ్ ను సైతం ఇంప్రెస్ చేశాడన్నమాట.

Tags

Next Story