Karate Kalyani: యూట్యూబర్‌తో కరాటే కళ్యాణి గొడవ.. పరస్పరం చేయి చేసుకుంటూ..

Karate Kalyani: టాలీవుడ్‌లోని సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కరాటే కళ్యాణి. తనకు నచ్చిన విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేసే వ్యక్తుల్లో తాను కూడా ఒకరు. అంతే కాకుండా తనతో ఎవరైనా అనవసరంగా పెట్టుకుంటే వారికి చుక్కలు చూపించేవరకు వదలరు కళ్యాణి. తాజాగా ఓ యూట్యూబర్ కళ్యాణితో అసభ్యకరంగా మాట్లాడాడు. అంతే కాకుండా చేయి చేసుకున్నాడు కూడా. ఇక కరాటే కళ్యాణి ఊరుకుంటుందా..? ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈమధ్య యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి యూట్యూబర్‌లుగా పేరు తెచ్చుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శ్రీకాంత్ రెడ్డి. తను అమ్మాయిలు, మహిళలపై ప్రాంక్ వీడియోలు చేస్తూ.. వారితో శృంగార సంభాషణలు చేస్తుంటాడు. అయితే ఇది కళ్యాణికి నచ్చలేదు. అందుకే నిలదీయడానికి ఎస్ ఆర్ నగర్‌లో ఉండే తన ఇంటికి వెళ్లింది. తను తీసే ప్రాంక్ వీడియోల గురించి అడుగుతూ.. అతడిని చెంపపై కొట్టింది. అక్కడే గొడవ మొదలయ్యింది.
కరాటే కళ్యాణి.. శ్రీకాంత్ రెడ్డిని కొట్టడం గమనించిన ఓ వ్యక్తి కూడా తనతో కలిసి శ్రీకాంత్ మీద చేయి చేసుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన శ్రీకాంత్ తిరగబడ్డాడు. కరాటే కళ్యాణిని కొట్టి కింద పడేశాడు. ఇది చూసిన స్థానికులు శ్రీకాంత్‌ను చితకబాదారు. ఇంతలో కరాటే కళ్యాణి కూడా వారితో చేయి కలిపింది. శ్రీకాంత్ రెడ్డిని వెంబడించి మరీ కొట్టింది. ఆ సమయంలో శ్రీకాంత్ బట్టలు కూడా చినిగిపోయాయి.
కాస్త దూరం వెళ్లిన తర్వాత కళ్యాణిపైకి తిరగబడ్డాడు శ్రీకాంత్. 'నీ ప్రాంక్ చేస్తే తప్పు అంటున్నావ్. నువ్వు చేసే పనికిమాలిన పనులకంటే నేను చేసే వీడియోలు ఎక్కువ కాదు. నువ్వు వ్యాంప్ పాత్రలు చేయడం లేదా? నీ బాగోతం మొత్తం నాకు తెలుసు? వీడియో తీసుకుంటానంటే రూ.2 లక్షలు డబ్బులు అడిగి ఇప్పుడు ఇవ్వను అనేసరికి ఇలా చేస్తున్నావు' అంటూ ఫైర్ అయ్యాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో అంతా కళ్యాణి ఫేస్‌బుల్ లైవ్‌లో రికార్డ్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com