Karate Kalyani: అలాంటి అబ్బాయి దొరికితే సహజీవనం అయినా ఓకే: కరాటే కళ్యాణి

Karate Kalyani (tv5news.in)
Karate Kalyani: కరాటే కళ్యాణి అంటే తెలియని వారు చాలా తక్కువ. అంతకు ముందు పలు సినిమాలలోని క్యారెక్టర్లతో పాపులర్ అయిన కళ్యాణి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొన్న తర్వాత మరింత ఫేమ్ తెచ్చుకుంది. తాను ఎలా ఉంటుంది, తన మాట తీరు ఏంటి అనేది బిగ్ బాస్ చూసిన తర్వాతే చాలామంది ప్రేక్షకులకు అర్థమయ్యింది. తాజాగా ఈ నటి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కరాటే కళ్యాణికి ఇప్పటికే రెండుసార్లు పెళ్లి అయ్యింది. అయినా అందులో ఏ ఒక్కటి నిలబడలేదు. తాజాగా తన వైవాహిక జీవితంలో తాను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి బయటపెట్టింది కళ్యాణి. భార్య అంటే వంటింటికే పరిమితం అనుకునేవారు ఉంటారని, కానీ తాను అలా కాదు అంటోంది కళ్యాణి. ఫైర్ లాంటి దాన్ని అని, అందుకే నిప్పును ఎక్కువసేపు అరచేతిలో పట్టుకోలేక వదిలేశారు అని చెప్తోంది.
తాను కరెక్ట్‌గానే ఉన్నా అవతలి వారికి అది తప్పుగా అనిపించి మనస్పర్థలు లాంటివి వచ్చాయని తన వైవాహిక జీవితం గురించి బయటపెట్టింది కరాటే కళ్యాణి. గొడవ పడడం నచ్చకే విడాకులు తీసుకున్నానంటూ స్పష్టం చేసింది. అందుకే తనకు నచ్చినట్టు తాను హ్యాపీగా జీవిస్తున్నానని తెలిపింది కరాటే కళ్యాణి. ప్రేమ పేరుతో తనను వాడుకున్నారని, అందుకే ఇంకా నిజమైన ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉన్నానంది కళ్యాణి.
సరైన అబ్బాయి దొరికితే పెళ్లికే కాదు సహజీవనానికి కూడా తాను రెడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కళ్యాణి. అంతే కాకుండా తనకు పిల్లలంటే చాలా ఇష్టమన్న విషయాన్ని కూడా బయటపెట్టింది. అందుకే రెండు పెళ్లిళ్లు చేసుకున్నానని, తాగొచ్చి కొడుతుంటే భరించలేక విడాకులు తీసుకున్నానని స్పష్టం చేసింది. తాను చేయని తప్పులకు నిందలు వేసిన తనకు నచ్చదని తెలిపింది.
వైవాహిక జీవితంలోని కష్టాల వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ వల్ల పలుమార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట కళ్యాణి. ఒక్కసారి పది నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా బ్రతికి బయటపడడంతో ఇంకా తాను చేయాల్సింది ఏదో ఉంది అనుకొని ధైర్యంగా జీవిస్తున్నానని తెలిపింది కళ్యాణి. తాను పడిన కష్టాలు మరే ఆడది పడి ఉండదు అంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com