Karnataka : రాహుల్ గాంధీ కాపాడారన్న కన్నడ హీరోయిన్

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తనను రాహుల్ గాంధీ కాపాడారని అన్నారు ప్రముఖ నటి, కాంగ్రెస్ లీడర్ దివ్య స్పందన. తన తండ్రి మరణాంతరం డిప్రెషన్ కు లోనైనట్లు చెప్పిన ఆవిడ సుసైడ్ చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. అలాంటి పరిస్థితిలో, రాహుల్ గాంధీ తనకు ఎమోషనల్ గా సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. గతంలో కర్ణాటక కాంగ్రెస్ కు స్పోక్స్ పర్సన్ గా, సోషల్ మీడియా హెడ్ గా పనిచేశారు.
కన్నడ టాక్ షో 'వీకెండ్ విత్ రమేష్' లో ఓపెన్ అయిన దివ్య స్పందన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను పార్లమెంట్ కు ఎన్నికైన కొత్తలో అక్కడ ఎలా మసులుకోవాలో తనకు తెలియదని.. ఆ సమయంలోనే తన తండ్రి ఈ లోకాన్ని విడిచారని చెప్పారు. అప్పుడు తాను ఎంతగానో డిప్రెషన్ కు గురైనట్లు తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు ఎమోషనల్ గా సపోర్ట్ ఇచ్చారని చెప్పారు.
స్పందన 2012లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. 2013 బై ఎలక్షన్ లో మాండ్యా నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. గత సంవత్సరం రాజకీయాలను వదిలి సినీ ఇండస్ట్రీకి తిరిగి వచ్చారు. ఆవిడ సొంత ప్రొడక్షన్ హౌజ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆవిడ సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com