Acharya : చిరంజీవికి ఆచార్య డిస్ట్రిబ్యూటర్ ఓపెన్ లెటర్..!

Acharya : స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య..గత నెల ఏప్రిల్ 29న రిలీజైన ఈ మూవీకి దారుణమైన ఫ్లాప్‌ని మూటగట్టుకుంది.. టాలీవుడ్‌లో అల్ టైం డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయింది. రూ. 130 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ బిజినెస్ చేసిన ఆచార్య.. కేవలం రూ. 45 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టగా దాదాపు రన్ ముగిసింది. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ భారీగానే నష్టపోయారు.
అయితే కర్ణాటకకి చెందిన రాజగోపాల్ బజాజ్ అనే ఓ డిస్ట్రిబ్యూటర్ చిరంజీవికి బహిరంగంగా లేఖ రాశారు.. ఈ లేఖలో ఇప్పటికే కరోనా వల్ల తాము చాలా నష్టపోయామని, మరోసారి అప్పు తెచ్చి ఈ సినిమా కోసం ఖర్చు పెట్టామని, పెట్టుబడిలో కేవలం 25% మాత్రమే రాగా, 75% నష్టపోయామని పేర్కొన్నాడు. దయచేసి తమని ఆర్ధికంగా ఆదుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నాడు.
ఆచార్య నైజాం ఎగ్జిబిటర్‌గా ఉన్న వరంగల్ శ్రీను దగ్గర నుండి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రాజ్ గోపాల్ బజాజ్ కొనుగోలు చేశారు. కాగా ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.. మణిశర్మ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, రేజీనా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com