Sandalwood : సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం శాండల్ వుడ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయం సామాన్య ప్రజలకు మాత్రం అంతులేని ఆనందాన్ని కలిగించేది కావడం విశేషం. ఈ మేరకు రెండు వర్గాల నుంచి స్పందనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ప్రభుత్వం ఏం చేసిందీ అంటే.. ఇకపై కర్ణాటకలోని అన్ని మల్టీ ప్లెక్స్ ల్లో టికెట్ ధరలను 200లుగా ఫిక్స్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. టికెట్ ధరలపై నియంత్రణ కోసమే ఇలా చేశాం అని చెప్పింది ప్రభుత్వం.
ప్రభుత్వ నిర్ణయంపై సినిమా అభిమానులు, సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమా పరిశ్రమ మాత్రం ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇలాగైతే భారీ బడ్జెట్ సినిమాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ భారీ బడ్జెట్ పేరుతో ప్రేక్షకుల జేబులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు కదా అనేది ఇంకొందరి వాదన.
హీరోలకు, దర్శకులకు ఉన్న పరిచయాలను బట్టి మొన్నటి వరకూ తెలుగు స్టేట్స్ లో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి కాస్త కంట్రోల్ లోనే ఉంది. మరి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం పట్ల శాండల్ వుడ్ పెద్దలు ఇంకా ఎలా స్పందిస్తారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com