Multi-Starrer : మహేష్,-కార్తీ మల్టీస్టారర్

Multi-Starrer : మహేష్,-కార్తీ మల్టీస్టారర్

తమిళ స్టార్ కార్తీ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన హీరోగా చేసిన దాదాపు అన్నీ సినిమాలు తెలుగులో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఆయన డైరెక్ట్ తెలుగులో చేసిన ఊపిరి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి తెలుగులో డైరెక్ట్ మూవీ చేయడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు కార్తీ. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ లభించింది. ఈ సందర్బంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీ మహేష్ బాబు తాను చిన్నప్పుడు ఒకే స్కూల్లో లో చదువుకున్నాం అని, మంచి కథ కుదిరితే ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు". ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story