Karthi : మరో తెలుగు సినిమాలో కార్తీ

తమిళ్ స్టార్ హీరో వైవిధ్యమైన పాత్రలతో తెలుగులోనూ తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు. తన ఫస్ట్ మూవీలోనూ డబ్బింగ్ చెబుతూ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. అయితే ఈ మధ్య కాలంలో సరైన మూవీస్ పడడం లేదు. దీంతో పాటు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం లైన్ లో ఉన్న మూవీ అంటే సర్దార్ 2. ఇది ఎప్పుడో విడుదల కావాల్సిన మూవీ. ఎందుకో బాగా లేట్ అయింది. అలాగే ఖైదీ 2 అన్నారు. బట్ లోకేష్ కనకరాజ్ ఈ మూవీని లైట్ తీసుకున్నాడని కొన్ని రోజుల తర్వాత అర్థమైంది. ఇది కాక మార్షల్ అనే మూవీ చేస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అతను టానక్కారణ్ అనే మూవీతో అద్భుతం అనిపించుకున్నాడు. సో.. ఇవి కాక కార్తీ సడెన్ గా ఓ తెలుగు మూవీకి ఓకే చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
యస్ కార్తీ గతంలో ఊపిరితో డైరెక్ట్ తెలుగు మూవీ చేశాడు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మరో మూవీతో వస్తున్నాడు. ఆల్రెడీ అతని అన్న సూర్య కూడా ఫస్ట్ తెలుగు మూవీ చేశాడు కదా. విశ్వనాథ్ అండ్ సన్స్ తో. అలా కార్తీ మరో తెలుగు మూవీకి ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ డైరెక్టర్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం ఉండబోతోంది. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరుపుకుంది. మరి కళ్యాణ్ శంకర్ తో సినిమా అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లా ఉంటుందా లేక కొత్తగా ఇంకేదైనా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా తమిళ్ హీరోలంతా తెలుగు సినిమాలకు బాగా అలవాటు అవుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
