Devara : ఎన్టీఆర్ కు పోటీగా కార్తీ

Devara : ఎన్టీఆర్ కు పోటీగా కార్తీ
ఎన్టీఆర్ దేవర రిలీజ్ రోజునే తన కొత్త సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన తమిళ్ హీరో కార్తీ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పోటీగా దిగుతున్నాడు కార్తీ. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న దేవర మూవీకి పోటీగా ప్యాన్ ఇండియా కాకపోయినా తమిళ్, తెలుగులో కాంపిటీషన్ ఇచ్చేందుకు బరిలో దిగుతున్నాడు కార్తీ. కార్తీ మూవీ అంటే తమిళ్ లో ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగులోనూ అంతే ఉంటుంది. అతని కొన్ని సినిమాలు తమిళ్ కంటే ఇక్కడే పెద్ద విజయాలు సాధించడం చూశాం. అందుకే కార్తీ సినిమా కూడా అదే రోజు వస్తోందంటే కొంత ఆసక్తి ఉండటం సహజం. కానీ అతను ఎన్టీఆర్ కు పోటీ ఇస్తాడా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి. కాకపోతే తమిళ్ లో కొంత వరకూ పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకీ కార్తీ సినిమా ఏంటీ అనే కదా మీ డౌట్.

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా రూపొందుతోన్న దేవర 1 సెప్టెంబర్ 27న విడుదలవుతోంది. అదే రోజున కార్తీ నటించిన ‘మేయాళగన్’ అనే మూవీ వస్తోంది. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో ‘96’ అనే మూవీతో సంచలనం సృష్టించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతనే ఆ సినిమాను తెలుగులో శర్వానంద్, సమంత జంటగా జాను అనే పేరుతో రీమేక్ చేశాడు. బట్ ఇక్కడ వర్కవుట్ కాలేదు. ఆ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన మేయాళగన్ ను కూడా సెప్టెంబర్ 27నే విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఇది దేవరకు పోటీగా వస్తోంది అనే టాక్స్ మొదలయ్యాయి.

నిజానికి తమిళ్ వాళ్లు తెలుగు వాళ్లలా కాదు. ముందు తమ హీరోలకే ప్రాధాన్యత ఇస్తారు. తర్వాతే ఎవరైనా అంటారు. అందువల్ల దేవరకు ఇతర భాషల్లో ఇబ్బంది లేకపోయినా తమిళ్ లో కొంత వరకూ కార్తీ నుంచి పోటీ ఎదురు కావొచ్చు అనే చెప్పాలి.

Tags

Next Story