కార్తీకదీపం సెట్‌లో డాక్టర్ బాబు హల్చల్.. తల్లితో కలిసి ఏంచేశాడంటే..

కార్తీకదీపం సెట్‌లో డాక్టర్ బాబు హల్చల్.. తల్లితో కలిసి   ఏంచేశాడంటే..
Karthika Deepam: బుల్లితెరపై మెగా సిరీయల్ కార్తీక దీపం. ఈ సిరీయల్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Nirupam Paritala: బుల్లితెరపై మెగా సిరీయల్ కార్తీక దీపం. ఈ సిరీయల్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ లో దీప, డా.బాబు, మోనిత, సౌందర్య పాత్రలు ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటారు. కార్తీకదీపం సెట్‌లో డా.బాబు( నిరుపమ్) రచ్చ రచ్చ చేస్తున్నారు. తల్లి సౌందర్య (అర్చన)తో కలిసి నిరుపమ్ మొబైల్ లో ఎదో చూస్తున్న ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. తల్లిదండ్రులతో ఇలా ఉన్నాడేంటి? అని అనుకుంటారని ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు నిరుపమ్.

'నా యూట్యూబ్ చానెల్‌ని సబ్ స్క్రైబ్ చేసి సాక్ష్యం చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. రీల్స్ కోసం అంటా.. మీరు సబ్‎స్క్రైబ్ చేశారుగా.. మా యూట్యూబ్ చానెల్‌కి మంజుల నిరుపమ్.. ఇంతకీ ఆవిడని గుర్తు పట్టారో లేదో.. ఆమె కార్తీకదీపంలోని సౌందర్య అంటూ కౌంటర్ వేసేశారు. నిరుపమ్ తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. అలా చెప్పినట్టుగానే నిన్న యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు.Tags

Read MoreRead Less
Next Story