Nirupam Paritala: కార్తీక దీపం డాక్టర్ బాబుకి ఎంత ఆస్తి ఉందో తెలుసా?

Nirupam File Photo
Nirupam Paritala: బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన టాప్ సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్లో నటిస్తున్న డా. బాబు, వంటలక్క(దీప), మోనిత, సౌందర్య పాత్రలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. వీరి అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. డా. బాబు(నిరుపమ్ పరిటాల)వరుస సీరియల్స్ లో నటిస్తూ బీజీగా ఉంటున్నారు. సినిమా హీరోగా రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాలేదు. చంద్రముఖి సీరియల్ ద్వారా హీరోగా మారడంతో కనీసం ఇలాగైనా హీరో అయ్యాయనని తనకు తానే నచ్చజెప్పుకునేవాడు.
ఆ తర్వాత హిట్లర్ గారి పెళ్లాం, మూగమనసులు, కాంచనగంగ, కార్తీకదీపం, కలవారి కోడలు ఇలా పలు సీరియల్స్ తో బుల్లితెరపై దున్నేస్తున్నాడు. నిరుపమ్ పరిటాల తనదైన నటనతో మహిళా ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కార్తీక దీపం సీరియలో నటిస్తున్న నిరుపమ్ రోజుకు రూ.22 వేలు పారితోషకం అందుకుంటున్నాడని తెలుస్తోంది. డా.బాబుకు వైజాగ్ ఇష్టమైన ప్లేస్. అక్కడ ఐదు కోట్ల నెట్ వర్త్ ఉంటుందని టాక్. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ భువన అపార్ట్ మెంట్స్ ప్లాట్ ఖరీదు రూ.80లక్షలు. ఇక ఇతడికి 11లక్షల విలువైన కారు ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. నిరుపమ్ భార్య ముంజుల కూడా సిరీయల్స్ లో బిజీగా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
సినిమా నటుడిగా,రచయిత ఓంకార్ నిరుపమ్ తండ్రే. ఓంకార్ సినిమాలకు పనిచేసినప్పుడు చెన్నైలో ఉండడం వలన నిరుపమ్ కూడా అక్కడే పెరిగాడు. అనారోగ్యంతో ఓంకార్ చనిపోవడంతో తనను సినిమా హీరోగా చూడాలన్న తండ్రి కోరిక సినిమాలు చేయలని అనుకున్నాడు. సినిమాల్లో ఛాన్స్ రాకపోవడంతో నిరాశలో ఉన్న నిరుపమ్ ను సీరియల్స్ అవకాశాలు పలకరించాయి. దీంతో వరుస పెట్టి సీరియల్స్ చేస్తూ బుల్లితెరపై పెద్ద స్టార్ గా ఎదిగాడు నిరుపమ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com