Karthika Deepam: సౌందర్యపై డాక్టర్ బాబు షాకింగ్ పోస్ట్..! సోషల్ మీడియాలో వైరల్
![Karthika Deepam: సౌందర్యపై డాక్టర్ బాబు షాకింగ్ పోస్ట్..! సోషల్ మీడియాలో వైరల్ Karthika Deepam: సౌందర్యపై డాక్టర్ బాబు షాకింగ్ పోస్ట్..! సోషల్ మీడియాలో వైరల్](https://www.tv5news.in/h-upload/2021/08/15/532934-karthik-12.webp)
బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన టాప్ సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్లో నటిస్తున్న డా. బాబు, వంటలక్క(దీప), మోనిత, సౌందర్య పాత్రలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. వీరి అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. డా. బాబు (నిరుపమ్ పరిటాల) తనదైన నటనతో మహిళా ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. నిరుపమ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటాడు.
అయితే తాజాగా నిరుపమ్ పెట్టిన ఫోస్టో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో భాగంగా డా. బాబు జైల్లో ఉన్నాడు. కార్తీక్ తల్లి పాత్రల్లో నటిస్తున్న సౌందర్యతో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో అడక్కుండానే డాక్టర్ ను చేశావ్.. పిలవకుండానే స్టేషన్ కు వచ్చావ్..అయినా నువ్వు నాకు నచ్చావ్..అంటూ నిలదీసినట్లు ఫన్నీగా క్యాప్షన్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. డా. బాబు వరుస సీరియల్స్ లో నటిస్తూ బీజీగా ఉంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com