Karthikeya 2 Twitter Review : సెకండ్ హాఫ్ సూపర్.. అంచనాలను రీచ్ అయిన కార్తికేయ 2
Karthikeya 2 Twitter Review : కార్తికేయ 2 సినిమా ఊహించినట్టుగానే అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 8 ఏళ్ల ముందు వచ్చిన కార్తికేయకు ఇది సీక్వెల్. చాలా గ్యాప్ తరువాత వచ్చినప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరణ్ మెయిన్ లీడ్ రోల్స్‌లో చందూ మొండేటి దర్శకత్వంలో దీనిని తెరకెక్కించారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక అగర్వాల్ కలిసి నిర్మించార. కాల భైరవ సంగీతాన్ని సమకూర్చారు.
కథ విషయానికి వస్తే.. కార్తికేయ (నిఖిల) వృత్తిపరంగా డాక్టర్.. అయితే శ్రీకృష్ణుడి గొలుసులో అతీతమైన శక్తులు వుంటాయి. ఈ గొలుసును నిఖిల్‌తో పాటు కొన్ని దుష్ట శక్తులు చేజిక్కిచ్చుకోవాలనుకుంటాయి. అయితే ఆ గొలుస మహిమ ఏంటి..? చివరికి దానికి కార్తికేయ దక్కించుకున్నాడా అనేదే మెయిన్ స్టోరీ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com