Karthi's Sardar 2 : కార్తీ సర్దార్ 2 టీజర్ వచ్చేసింది

Karthis  Sardar 2 :  కార్తీ సర్దార్ 2 టీజర్ వచ్చేసింది
X

నేచురల్ యాక్టర్ కార్తీ హీరోగా నటించిన సినిమా సర్దార్. పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో 2022లో వచ్చిన ఈ మూవీ తెలుగులో కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాలేదు కానీ.. తమిళ్ లో హిట్ అయింది. దేశంలో మంచి నీటికి సంబంధించిన అంశంతో ఓ భయంకరమైన స్కామ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ చాలామంది కళ్లు తెరిపించింది. కార్తీ డ్యూయొల్ రోల్ లో నటించిన ఈ మూవీలో రాశిఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా, చుంకీ పాండే విలన్ గా, లైలా ఓ కీలక పాత్రలో నటించారు. అయితే వీరిలో కార్తీ, రాశిఖన్నా తప్ప మిగతా పాత్రలన్నీ చనిపోతాయి. ఇప్పుడీ మూవీకి కొనసాగింపుగా ‘సర్దార్ 2 ప్రోలాగ్’ అనే టీజర్ విడుదలైంది.

సర్దార్ అంటే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ అని ఫస్ట్ పార్ట్ లోనే తేలిపోయింది కదా. ఆ సర్దార్ ఈ టీజర్ లో జపాన్ లోని ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ అతని మనుషుల్ని చంపేస్తుంటాడు. అందుకు కారణం తన దేశంలో జరుగుతున్న విధ్వంసం వెనక ఉన్న వ్యక్తిని తెలుసుకోవడమే. అయితే అతను సర్దార్ అనుకునేంత ఈజీ మనిషి కాదు అని అతను చెబుతాడు. మరోవైపు సర్దార్ ను పట్టుకునేందుకు జపాన్ ఆర్మీ ఆ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తను టార్గెట్ చేసిన విలన్ ను చంపేసి తప్పించుకుంటాడు సర్దార్. మధ్యలో విలన్ అన్నప్పుడు ఆ పాత్రలో ఎస్.జే సూర్య కనిపిస్తున్నాడు. అతని పాత్ర ఈ సారి మరింత పవర్ ఫుల్ గా ఉండేలా ఉంది. టీజర్ చివర్ లో యంగ్ కార్తీ, హీరోయిన్ అషికా రంగనాథ్ తో కలిసి ఏదో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా ఓ షాట్ ఉంది. ఇక ఈ టీజర్ కు శ్యామ్ సిఎస్ సంగీతం హైలెట్ అయ్యేలా ఉంది. మొత్తంగా మే 30న విడుదల కాబోతోన్న సర్దార్ 2 ఈ సారి సంచలనాలు సృష్టించేలానే ఉందంటున్నారు.

Tags

Next Story