Karthi : దేవరపై యుద్ధం.. ఇంత చప్పగానా..

దేవర.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న మూవీ. అలాగని ఇదేం కేవలం ఎన్టీఆర్ క్రేజ్ వల్ల కాదు. జస్ట్.. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద సినిమాలేం లేకపోవడం వల్ల. బట్ తెలుగులో మాత్రం బారీ క్రేజ్ ఉంది. అది ఎన్టీఆర్ కు ఇక్కడ ఉన్న ఇమేజ్ వల్ల. అందుకే మరో సినిమా ఆ డేట్ కు విడుదల చేయడానికి టాలీవుడ్ భయపడింది. బట్ కోలీవుడ్ నుంచి కార్తీ నటించిన సత్యం సుందరం వస్తోంది. కార్తీతో పాటు అరవింద్ స్వామి కీలక పాత్ర చేశాడు. తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని తమిళ్ లో ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. తెలుగులోనూ ముందు అడే డేట్ వేశారు.
సత్యం సుందరం తెలుగు ప్రమోషన్స్ చాలా డల్ గా ఉన్నాయి. ఇప్పటి వరకూ సాలిడ్ గా ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే మన నేటివిటీకి కాస్త దూరంగా ఉన్న సినిమా అనిపిస్తుంది. బావ బావమరిది మధ్య సాగే కథలా కనిపిస్తోంది. అయితే ఈ మూవీలో రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్ ఉండవట. కార్తీ మూవీ నుంచి ఇలాంటి సినిమా వస్తే జనం చూస్తారా.. అదీ తెలుగు వాళ్లు. తమిళ్ వాళ్లకు ఇలాంటి ప్రయోగాలు అలవాటే కాబట్టి నో ప్రాబ్లమ్. మరి తెలుగులో ఎన్టీఆర్ ను ఢీ కొట్టడం అంటే చిన్న విషయమా. తెలుగు వాళ్లే వెనక్కి తగ్గితే కార్తీ సై అన్నాడు. అసలు ప్రమోషన్స్ లేకుండా కూడా దేవరకు పోటీ అంటే టిప్పర్ లారీ పైకి స్కూటర్ వేసుకు వెళ్లడమే. అయినా కార్తీ తగ్గడంలేదు. దేవర పై యుద్ధం అంటే ఇంత చప్పగా ఉంటే ఎలా..? అదీ తెలుగులో మార్కెట్ కూడా ఉన్న హీరో కార్తీ. కాస్త ట్రై చేస్తే ఏదో రకంగా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి కదా. ఏదేమైనా దేవర రిజల్ట్ ను బట్టి సత్యం సుందరం భవిష్యత్ తేలిపోతుంది. అలాగే తమిళ్ లో ఈ మూవీ రిజల్ట్ ను బట్టి దేవర కలెక్షన్స్ కనిపిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com