Kartikeya: ప్రేమించిన అమ్మాయికి వేదికపైనే ప్రపోజ్ చేసిన కార్తికేయ..

Kartikeya: ప్రేమించిన అమ్మాయికి వేదికపైనే ప్రపోజ్ చేసిన కార్తికేయ..
Kartikeya: ఆర్‌ఎక్స్ 100 సినిమాతో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న యంగ్ హీరో కార్తికేయ.

Kartikeya: ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రేమ, పెళ్లి అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు కెరీర్ కూడా ముఖ్యమే. అందుకే ఈ జెనరేషన్ అంతా ముందు కెరీర్‌ను సరిదిద్దుకోవాలి. తరువాతే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటోంది. సినీరంగంలోకి వచ్చి సక్సెస్ సాధించిన తరువాతే ఫ్యామిలీ లైఫ్‌ను మొదలుపెట్టాలి అనుకునేవారు కూడా ఉన్నారు. అలా అనుకున్నవారిలో ఒకరు యంగ్ హీరో కార్తికేయ. ఇటీవల తన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కార్తికేయ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.

సినిమా రంగంలో రావాలనుకోవడం.. ఏ సపోర్ట్ లేకుండా హీరోగా ఎదగాలి అనుకోవడం కష్టంతో కూడుకున్న పని. అయినా కూడా ఇప్పటికీ ఎంతోమంది ఆ స్థాయి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా 'ప్రేమతో మీ కార్తిక్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యి.. 'ఆర్‌ఎక్స్ 100'తో తానేంటో నిరూపించుకొని స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఈ యంగ్ హీరో కెరీర్‌ను హిట్ ట్రాక్‌లో నడిపిస్తుండడంతో ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.


కార్తికేయ.. తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను ప్రేమించి పెళ్లి చేసుకోనున్నాడు. కొన్ని రోజుల క్రితం వీరిద్దరికి ఇంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ పెళ్లి ఎప్పుడు అన్న విషయాన్ని కార్తికేయ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా కార్తికేయ అప్‌కమింగ్ మూవీ ప్రెస్ మీట్‌లో లోహితకు వేదిక పైన ప్రపోజ్ చేసిన కార్తికేయ.. ఈ నెల 21న తనను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. అంతే కాకుండా తాను హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో.. తన ప్రేమ విషయంలో కూడా అంతే కష్టపడినట్టు తెలిపాడు. స్టేజీపైనే తనకు కాబోయే భార్యకు క్యూట్‌గా ప్రపోజ్ చేయడంతో నెటిజన్లు తనకు ఫిదా అయిపోయారు.

Tags

Next Story