Kiran Abbavaram : అందర్లోనూ ‘క’ దే కమాండ్

Kiran Abbavaram :  అందర్లోనూ ‘క’ దే కమాండ్
X

దీపావళి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలకూ పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక్క బఘీరాను తప్ప అన్ని సినిమాలను హిట్ అనేశారు ఆడియన్స్. అయినా ఎవరు పెద్ద విజయం సాధించారు అనే పాయింట్ ఉంటుంది కదా.. ? అలా చూస్తే అందరిలోనూ కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్ అనిపించుున్న సినిమా లక్కీ భాస్కర్. యస్.. ఈ సినిమా బాక్సాఫీస్ పై సాలిడ్ కమాండ్ చూపించింది. అయితే వీక్ డేస్ లో కాస్త వీక్ అయింది. బట్ కిరణ్ అబ్బవరం ‘క’ మాత్రం వీక్ డేస్ లోనూ కమాండ్ చూపిస్తోంది. ఈ సినిమా రేంజ్ కు ఇప్పటికే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. లక్కీ భాస్కర్ సైతం ప్రాఫిటబుల్ గా తేలిపోయింది.

క విషయంలో ప్రమోషన్స్ ఎక్కువ హెల్ప్ చేస్తున్నాయి. సినిమాకు హిట్ టాక్ వచ్చింది. థియేట్రికల్ బిజినెస్ కు మించిన వసూళ్లు ఆల్రెడీ వచ్చాయని కామ్ గా లేడు కిరణ్. ఈ జోష్ ను డబుల్ చేస్తూ ఊరూరూ తిరుగుతూ ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నాడు. హైదరాబాద్, కరీంనగర్ నుంచి తిరుపతి వరకూ థియేటర్స్ కు వెళ్లి మరీ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇది సినిమాకు చాలా పెద్ద హెల్ప్ అవుతోంది. అంటే సూపర్ హిట్ కాస్తా బ్లాక్ బస్టర్ కావడానికి ఇదే ఎక్కువ ఉపయోగపడింది అని చెప్పాలి. ఈ విషయంలో కిరణ్ ను అభినందించాల్సిందే. ఆ మాటకొస్తే కిరణ్ మాత్రమే కాదు.. ఇలా సినిమాను పూర్తిగా భుజాన వేసుకుని జనాల్లోకి తీసుకువెళుతోన్న హీరోలు ఈ మధ్య టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేని స్టార్స్. సో.. వారి కష్టమే వారిని అందలమెక్కిస్తుందని వేరే చెప్పక్కర్లేదేమో. ఈ గుణం వల్లే క ఇప్పుడు వీక్ డేస్ లోనూ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తోంది. కమర్షియల్ గా మరో లెవల్ కు వెళ్లబోతోంది.

Tags

Next Story