సోషల్ మీడియాలో వర్ష హంగామా మామూలుగా లేదుగా..!

సోషల్ మీడియాలో వర్ష హంగామా మామూలుగా లేదుగా..!
Kasturi serial Actress Varsha: తెలుగులో సీరియల్స్ నటీనటులకు ఉండే క్రేజ్ మరెవరికి ఉండదేమో.

Kasturi serial Actress Varsha: తెలుగులో సీరియల్స్ నటీనటులకు ఉండే క్రేజ్ మరెవరికి ఉండదేమో. ఏదైనా ఒక సీరియల్ లో నటిస్తే చాలు.. ఆ పాత్రలో ఉన్న పేరుతోనే బయట ప్రపంచానికి వారు పరిచయం అవుతారు. ఇక సోషల్ మీడియాలో సీరియల్ నటీనటులు చేసే హంగామా మాములుగా ఉండదు. కొంత మంది సీరియల్ స్టార్స్ తమ ఇన్ స్టాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. వారు ఎప్పటికప్పుడు తమ అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వర్ష కూడా .. తన ఇన్ స్టా రీల్స్ లో వీడియోలు షేర్ చేస్తుంది.


వర్ష అందరికీ తెలుగు సీని అభిమానులకు పరిచయమే. బుల్లితెరపై నందిని అనే సీరియల్ కూడా చేసింది వర్ష. తెలుగులో వందకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. వర్షా చాల సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలుగా, అలాగే పలువురు హీరోలకు చెల్లెలు పాత్రలు చేసింది. టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్ తో నటించిన "వాసు" చిత్రంలో ఆయనకు చెల్లెలి పాత్రలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది వర్షా. సింహ రాశి మూవీలో కూడా రాజశేఖర్ చెల్లెలి పాత్ర చేసింది. ఆ మూవీలో ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సన్నివేశాలలో అద్భుతంగా నటించింది.


పెళ్లైన తర్వాత కొంతకాలంపాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది వర్ష. దాదాపు 5 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న వర్ష అజయ్.. మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వర్ష.. కస్తూరి అనే సీరియల్ లో నటిస్తుంది. కాగా ఇటీవలే వర్ష సోషల్ మీడియాలో అడుగు పెట్టింది. ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. సీరియల్ విరామ సమయంలో నటీనటులతో కలిసి ఇన్ స్టా రీల్స్ చేస్తుంది. దీంతో వర్షా ఇన్ స్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా 8వేల మందిపైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు. "వర్ష" కూడా తనకు సంబంధించిన వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది.
Tags

Read MoreRead Less
Next Story