సినిమా

Katrina Kaif Vicky Kaushal: విక్కీ, కత్రినా ప్రేమకు కారణం ఆ షోనే..

Katrina Kaif Vicky Kaushal: కలిసి స్క్రీన్ పై కనిపించకపోయినా ప్రేమ చిగురిస్తుంది అనుకోవడానికి కత్రినా, విక్కీనే ఉదాహరణ.

Katrina Kaif Vicky Kaushal: విక్కీ, కత్రినా ప్రేమకు కారణం ఆ షోనే..
X

Katrina Kaif Vicky Kaushal: సినీ పరిశ్రమలో ప్రేమకథలు సహజం. ఒక హీరో, హీరోయిన్ పదే పదే సినిమాల్లో కలిసి నటిస్తున్నారంటే.. వారి మధ్య ఏదో ఉందని రూమర్స్ మొదలయిపోతాయి. అవి చాలా సందర్భాల్లో నిజమవుతాయి కూడా. కానీ ఒక హీరో, హీరోయిన్ కలిసి స్క్రీన్ పై కనిపించకపోయినా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది అనుకోవడానికి కత్రినా కైఫ్, విక్కీ కౌశలే ఉదాహరణ. ఇంతకీ వీరి ప్రేమకథ ఎక్కడ మొదలయ్యింది అన్న సందేహం చాలామందికి ఉంది.



కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వీరిద్దరు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈవెంట్స్‌లో తప్ప బయట కూడా పెద్దగా కలిసి కనిపించలేదు. కానీ ఒక్కసారిగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అన్న వార్త బాలీవుడ్ సర్కిల్లో వైరల్ అయ్యింది. ఎప్పుడూ కలిసి కనిపించని వీరు ప్రేమలో ఉండడమేంటి అని చాలామంది ఈ రూమర్స్‌ను కొట్టిపారేశారు. ఇంతలోనే ఆ రూమర్స్ నిజమేనేమో అనిపించేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


బాలీవుడ్‌లో 'కాఫీ విత్ కరణ్' షో చాలా ఫేమస్. దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఈ షో ద్వారా టాక్ షోలకు కొత్త క్రేజ్‌ను తీసుకొచ్చాడు. బడా బాలీవుడ్ సెలబ్రిటీలను పిలవడం.. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడగడం ఈ షోలో కామన్‌గా జరిగే విషయాలు. కత్రినా, విక్కీ ప్రేమ వ్యవహారం కూడా ఈ షోలోనే బయటపడింది.


ముందుగా కత్రినా.. కాఫీ విత్ కరణ్ షోకు వచ్చినప్పుడు.. తాను ఇప్పటివరకు విక్కీతో కలిసి నటించకపోయినా.. వారిద్దరు స్క్రీన్‌పై బాగుంటారని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆ తర్వాత షోకు విక్కీ కౌశల్ వచ్చినప్పుడు.. కత్రినా చెప్పిన ఈ మాటలను విక్కీకు తెలియజేశాడు కరణ్. వారి పెయిర్ బాగుంటుందని కత్రినా అభిప్రాయపడుతుంది అని తెలియగానే విక్కీ షాక్ అయ్యాడు. ఆ తర్వాత నుండి వారు ఎప్పుడు కలిసిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించేవారు.. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES