సినిమా

Katrina Kaif Vicky Kaushal: వచ్చిన గెస్ట్‌లకు కత్రినా, విక్కీ స్పెషల్ వెల్‌కమ్..

Katrina Kaif Vicky Kaushal: కత్రినా కౌఫ్, విక్కీ కౌశల్.. ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.

Katrina Kaif Vicky Kaushal: వచ్చిన గెస్ట్‌లకు కత్రినా, విక్కీ స్పెషల్ వెల్‌కమ్..
X

Katrina Kaif Vicky Kaushal: కత్రినా కౌఫ్, విక్కీ కౌశల్.. ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. పెద్దగా బయట పార్టీలలోనూ కలిసి కనిపించలేదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మెల్లగా అది వారిని పెళ్లి పీటల వరకు నడిపించింది. డిసెంబర్ 7న విక్కీ కత్రినా పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి తప్ప దీనికి వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. కానీ పెళ్లికి మాత్రం సిద్ధం అయిపోయారు.

ఈరోజు పెళ్లి వేడుకలు జరుగుతున్నా కూడా దానికి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా వారు బయటికి రానివ్వలేదు. అంతే కాదు ఇప్పటివరకు వారి పెళ్లికి సంబంధించి ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియా వరకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని, దానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు రావడమే తప్ప అందులో ఓ ఒక్కదాని గురించి వీరు నోరు విప్పలేదు.

ఇటీవల డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వచ్చిన గెస్ట్‌ల కోసం విక్కీ, కత్రినా స్పెషల్ ఇన్విటేషన్‌ను రెడీ చేశారు. ఇందులో గెస్ట్‌లు ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నట్టు, అన్నీ మర్చిపోయి పెళ్లి తంతును ఎంజాయ్ చేయండి అంటూ తెలిపారు. అంతే కాకుండా పెళ్లికి వచ్చిన గెస్ట్‌లు వారి ఫోన్‌లను మంపడంలోకి తీసుకురావద్దని స్పష్టంగా చెప్పారు. కత్రినా, విక్కీ పెళ్లి ఫోటోలు ఎప్పుడెప్పుడు చూస్తామా అని బాలీవుడ్ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.Next Story

RELATED STORIES