Ranbir Kapoor-Alia Bhatt మాజీ ప్రియుడికి మ్యారేజ్ విషెస్.. పోస్ట్ వైరల్

Ranbir Kapoor-Alia Bhatt మాజీ ప్రియుడికి మ్యారేజ్ విషెస్.. పోస్ట్ వైరల్
Ranbir Kapoor-Alia Bhatt:ఎన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి.. అంతే కదా మరి.. పెళ్లికి ముందు ఎంతో మందిని ప్రేమిస్తుంటారు.

Ranbir Kapoor-Alia Bhatt: ఎన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి.. అంతే కదా మరి.. పెళ్లికి ముందు ఎంతో మందిని ప్రేమిస్తుంటారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు.. కానీ మూడుముళ్ల బంధం ఒక్కరితోనే ముడిపడి ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ ని ప్రేమించారు ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు.. అందులో ఒకరు దీపికా పదుకొణె కాగా మరొకరు కత్రినా కైఫ్. ప్రేమించిన ప్రియురాళ్లను పక్కన పెట్టి అలియాతో ప్రేమలో పడ్డాడు రణ్‌బీర్‌.. ఆమె మెడలోనే మూడు ముళ్లు వేశాడు..

ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత, రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని వారి ఇంటిలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అలియా వివాహ వేడుకలకు సంబంధించిన మధుర స్మృతులను అభిమానులతో పంచుకుంది.. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


అభిమానులతో పాటు నటీమణులు దీపికా పదుకొణె అలియా, రణబీర్ లకు శుభాకాంక్షలు అందించారు. "మీ ఇద్దరికీ జీవితాల్లో ప్రేమ, సంతోషం ఉండాలి. మీ జీవితంలో వెలుగులు పండాలి. మీరిరువురు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను" అని రాశారు. దానికి హార్ట్ ఎమోజీ జోడించారు. కాగా, దీపిక రణ్ వీర్ కపూర్ ని వివాహం చేసుకుని ఆనందంగా ఉంది. వివాహనంతరం కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూ మంచి మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది.

రణబీర్ తో డేటింగ్ చేసిన మరోనటి కత్రినా కైఫ్. వారి వివాహానికి శుభాకాంక్షలు తెలియజేశారు. "మీ ఇద్దరికీ అభినందనలు – అందరి ప్రేమ మీపై ఉంటుంది. మీరు సంతోషంగా మీ జీవితాన్ని సాగించాలి అని కత్రినా పోస్ట్ పెట్టింది.


మాజీ ప్రియుడికి మ్యారేజ్ విషెస్.. పోస్ట్ వైరల్ప్రియాంక చోప్రా కూడా ఆలియా, రణబీర్‌ల జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో నవ వధూవరుల ఫోటోను పంచుకుంటూ.. మీ ఇద్దరికీ అభినందనలు. మీ ఇద్దరూ జీవితాంతం ప్రేమ, సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను". అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story