25 July 2022 8:45 AM GMT

Home
 / 
సినిమా / Katrina-Vicky:...

Katrina-Vicky: కత్రినా-కౌశల్ కనిపిస్తే చంపేస్తా: నెటిజన్ వరుస పోస్టులు

Katrina-Vicky: ఏమిటో అంత ఆగ్రహం.. ఎందుకో అంత కోపం.. ఇష్టం వచ్చినట్లు రాసుకోవడానికి ఓ వేదిక

Katrina-Vicky: కత్రినా-కౌశల్ కనిపిస్తే చంపేస్తా: నెటిజన్ వరుస పోస్టులు
X

Katrina-Vicky: ఏమిటో అంత ఆగ్రహం.. ఎందుకో అంత కోపం.. ఇష్టం వచ్చినట్లు రాసుకోవడానికి ఓ వేదిక ఉందని నెటిజన్లు రెచ్చిపోతుంటారు.. ప్రేమిస్తున్నామనో, పెళ్లి చేసుకోవాలనుందనో పెట్టే పోస్టులు చూశాం కానీ.. ఇలా చంపేస్తా అనే పోస్టులు చాలా అరుదుగా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి.

బాలీవుడ్ కొత్త జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి చేసుకుని వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నారు. మధ్యలో అతగాడికేమైందో వాళ్లిద్దరూ కనిపిస్తే చంపేస్తానంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జంట అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుమారు నాలుగేళ్లు ప్రేమించుకున్న విక్కీ, కత్రినా గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ కోటలో విరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న టైగర్-3లో కత్రిన భాగం కాగా, గోవిందా నామ్ మేరా, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, డుంకీ చిత్రాలతో విక్కీ బిజీగా ఉన్నారు.

Next Story