Vishwam : 'విశ్వం' సక్సెస్ కోసం కావ్య ఉపవాసం

ఈమాయ పేరేమిటో సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది ముంబై బ్యూటీ కావ్య థాపర్. ఆ సినిమా తరువాత ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవ కోన, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు చేసింది ఈ బ్యూటీ. కానీ ఇంతవరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈక్రమంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విశ్వం సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోందో. మ్యాచో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విజయం కావ్యకు చాలా ప్రత్యేకం కానుంది. అందుకే విశ్వం సినిమా భారీ విజయాన్ని సాధించాలని ఉపవాసం చేస్తోందట ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ "నేను మన కల్చర్స్ చాలా ఫాలో అవుతాను. నవరాత్రి సమయంలో ఏం చేస్తారో అవన్నీ చేస్తాను. మొదటి సారి నవరాత్రి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటున్నాను విశ్వం సినిమాకు మంచి విజయం సాధించాలని" అంటూ చెప్పుకొచ్చింది కావ్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com