Kayadu Lohar : ప్యారడైజ్ లోకి డ్రాగన్ బ్యూటీ ఎంట్రీ కన్ఫార్మ్

Kayadu Lohar :  ప్యారడైజ్ లోకి  డ్రాగన్ బ్యూటీ ఎంట్రీ కన్ఫార్మ్
X

హిట్ వెంట పరుగులు పెట్టే ఇండస్ట్రీ ఇది. హిట్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా పట్టించుకోరు. విజయానికి అంత ప్రాధాన్యం ఉంటుంది ఇక్కడ. అందుకే కొన్నాళ్ల క్రితమే టాలీవుడ్ కు పరిచయమైనా విజయం లేక ఎవరూ పట్టించుకోని బ్యూటీకి ఇప్పుడు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ హిట్ కోలీవుడ్ నుంచి రావడం విశేషం. తనే కయాడు లోహర్. ఆ మధ్య వచ్చిన తమిళ్ మూవీ ‘డ్రాగన్’తో బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతే.. ఆఫర్స్ క్యూ కట్టాయి. కోలీవుడ్ లోనే నాలుగు సినిమాలు చేస్తోంది. మళయాలంలో రెండు. ఇప్పుడు తెలుగులో కూడా అమ్మడికి ఆఫర్స్ పెరుగుతున్నాయి. ఆల్రెడీ సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య నటించే సినిమాలో కయాడునే హీరోయిన్ గా తీసుకున్నారు అనే టాక్ ఉంది. లేటెస్ట్ గా మరో బంపర్ ఆఫర్ అందుకుంది.

నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో రూపొందబోతోన్న ‘ద ప్యారడైజ్’ లో అమ్మడు సెలెక్ట్ అయింది. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిపోయింది అంటున్నారు. ద ప్యారడైజ్ ను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ చూస్తే మూవీ రా అండ్ రస్టిక్ గా ఉండబోతోందని అర్థమైంది. రమ్యకృష్ణ, సోనాలి కులకర్ణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కయాడు పాత్ర గ్లామరస్ గా ఉంటుందా లేక నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనా అనేది చూడాలి.

Tags

Next Story