Ram Pothineni డబుల్ ఇస్మార్ట్ సాంగ్ లో కేసీఆర్ డైలాగ్స్

రామ్ పోతినేని ( Ram Pothineni ), పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్. కావ్య థాపర్ హీరోయిన్. అంటే ఫస్ట్ పార్ట్ లో కనిపించిన నిధి అగర్వాల్ కు ఇందులో చోటు లేదు అనుకోవచ్చు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. మరోసారి మణిశర్మే సంగీతం అందించిన ఈ సాంగ్ చాలా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన పాటను రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, కీర్తన పాడారు. మార్ ముంతా చోడ్ చింతా అనే హుక్ లైన్ తో ఫస్ట్ పార్ట్ లోనే వచ్చిన పాటకు అప్పట్లో యూత్ అంతా థియేటర్స్ లో ఊగిపోయింది. ఆ ఊపును కంటిన్యూ చేస్తూ మరోసారి ఎనర్జిటిక్ కంపోజిషన్ తో పాటు మంచి కొరియోగ్రఫీ కూడా కనిపిస్తోంది. ఇక పాట మధ్యలో.. ‘ అయితే ఏం జేద్దాం అంటవ్ మరి..’ అనే కేసీఆర్ ఫేమస్ డైలాగ్ వాడారు. అది అదిరిపోయిందనే చెప్పాలి. ఇక రాయలసీమ నుంచి కనిపించే ఓ వ్యక్తి చేసే రీల్స్ లో ఎంజాయ్ పండగో అనే పదాలూ ఫేమస్. అందులో పండగో అనే పదం కూడా వాడారు. బట్ కేసీఆర్ డైలాగ్ మాత్రం బలే యాప్ట్ అయింది.
పూరీ జగన్నాథ్ ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అటు రామ్ సైతం డబుల్ ఇస్మార్ట్ తనకు ఇస్మార్ట్ శంకర్ లాగానే డబుల్ బ్లాక్ బస్టర్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా డబుల్ ఇస్మార్ట్ ను విడుదల చేయబోతున్నారు. పూరీ ఇంతకు ముందు చేసిన లైగర్ కు దేశవ్యాప్తంగా డిజాస్టర్ టాక్ వచ్చినా..అతని టేకింగ్ గురించి చాలామందికి తెలుసు. పైగా ఈ సారి సంజయ్ దత్ ను విలన్ గా తీసుకున్నాడు.అందుకే అన్ని చోట్లా కాకపోయినా ముంబైలో అయినా వర్కవుట్ అవుతుందునుకోవచ్చు.
ఇక ఈ పాటలో రామ్ డ్యాన్స్ లు, మణిశర్మ మ్యూజిక్ కంటే కూడా హీరోయిన్ కావ్య థాపర్ సోయగాలు మరింత హైలెట్ కాబోతున్నాయని ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటేనేఅర్థం అవుతుంది. మామూలుగానే పూరీ తన హీరోయిన్లను చాలా గ్లామరస్ గా చూపిస్తాడు. అతని ఆలోచనను అచ్చంగా అమలు చేసినట్టుగా కావ్య కూడా కాదనకుండా అందాలారబోసినట్టుంది. ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్ ను ఇంతే గ్లామరస్ గా చూపించాడు పూరీ. ఇప్పుడు కావ్య. మరి ఈ ఎనర్జిటిక్ సాంగ్స్ తో పాటు కంటెంట్ కూడా బలంగా ఉంటే వీరు కోరుకునే బ్లాక్ బస్టర్ గ్యారెంటీగా పడుతుంది.అన్నట్టు ఈ డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com