డబుల్ ఇస్మార్ట్ పై కేసీఆర్ ఫ్యాన్స్ కు కోపం.. అందుకేనా..?

డబుల్ ఇస్మార్ట్ పై కేసీఆర్ ఫ్యాన్స్ కు కోపం.. అందుకేనా..?
X
డబుల్ ఇస్మార్ట్ మూవీలో కేసీఆర్ డైలాగ్ వాడటంపై దర్శకుడు పూరీని విమర్శిస్తున్న అభిమానులు..

రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీపై ఇంతకు ముందు ఎలాంటి బజ్ కనిపించలేదు. కానీ రీసెంట్ గా సినిమా మొత్తం అమ్ముడైపోయింది. హను మాన్ ప్రొడ్యూసర్స్ భారీ మొత్తానికి తీసుకుని డబుల్ ఇస్మార్ట్ ను రిలీజ్ చేయబోతుండటంతో అనూహ్యంగా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో అనుకోని వివాదం వచ్చింది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మార్ ముంతా చోడ్ చింతా అనే పాట విడుదల చేశారు. పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ప్రెస్ మీట్స్ లో ఉపయోగించిన ‘అయితే ఏం జేద్దాం అంటవ్ మరి’ అనే డైలాగ్ వాడారు. దీంతో కేసీఆర్ అభిమానులు దర్శకుడు పూరీ జగన్నాథ్ పై మండిపడుతున్నారు. ఈ పదం తీసేయమని హెచ్చరిస్తున్నారు. కానీ ఇలా చేయడం ఏమంత భావ్యం కాదు అని పూరీతో పాటు సినిమా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ఈ డైలాగ్ ఇప్పుడేం కొత్తగా వాడలేదు. ఇప్పటికే కొన్ని వేల మీమ్స్ లో వాడారు. ట్రోల్స్ గానూ వాడారు. సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రతి రోజూ వినిపిస్తూనే ఉంది. అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయో వేరే చెప్పక్కర్లేదు. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమంపై సెటైర్స్ వేస్తూ పూరీ కెమెరామేన్ గంగతో రాంబాబు అనే సినిమా చేశాడు. ఆ టైమ్ లోనే అతనిపై ఉద్యమకారులు మండిపడ్డారు. అలాంటి పూరీ ఇప్పుడు కేసీఆర్ డైలాగ్ వాడటం వల్లనే ఇలా జరుగుతోందంటున్నారు. ఏదేమైనా రాష్ట్రం వచ్చి దశాబ్దం దాటింది. అప్పుడు కేసీఆరే ఇండస్ట్రీకి అండగా నిలిచాడు. అలాంటిది పూరీ జగన్నాథ్ పై ఇప్పుడు ఒక్క డైలాగ్ వాడాడు అని విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదేమో.

Tags

Next Story