Star Heroine: జాతీయ నటిగా ఎదిగిన హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..

మాటలో అణుకువ.. మహానటిని చేసింది.. నటన వారసత్వంలో ఉన్నా అందం, అణుకువ, అభినయం ఆమెని జాతీయస్థాయిలో గుర్తింపుతెచ్చుకునేలా చేశాయి. బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా హీరోయిన్‌గా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది.. మహానటి సావిత్రి పాత్రకు మరేనటిని ఊహించలేనంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది.
ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. 2013 మలయాళ చిత్రం గీతాంజలిలో నటించింది. తల్లి మేనక కూడా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంటుంది..
గీతాంజలిలో ద్విపాత్రాభినయం చేసి ఆ తర్వాత వచ్చిన చిత్రంలో అంధురాలి పాత్ర పోషించి నటనను ఓ ఛాలెంజింగ్‌గా స్వీకరించింది. తెలుగులో రామ్ సరసన నేను శైలజగా నటించి మెప్పించింది.
మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ఉత్తమ నటిగా 2018 జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. గాంధారి అని ఓ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసి ఆకట్టుకుంది కీర్తి సురేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com