Keerthi Suresh : స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న కీర్తి..

Keerthy Suresh: అవకాశాలు ఊరికే రావు.. అదృష్టం కూడా తోడవ్వాలి.. మణిరత్నం చిత్రంలో నటించడం అదృష్టమే మరి. ఆయన డైరెక్షన్‌లో ఓ చిన్న రోల్ చేసినా చాలనుకుంటారు నాయకా నాయకులు.. ఆయన ఏ సినిమా తీసినా ఓ క్లాసిక్‌గా మిగిలిపోతుంది.. కథ నుంచి సంగీతం వరకు ఆయన శైలే వేరు.. పైగా హేమా హేమీలంతా ఆ చిత్రంలో నటిస్తున్నారు. మహానటి కీర్తి సురేష్‌కి కూడా ఆ సినిమాలో స్థానం కల్పించాలనుకున్నారు మణిరత్నం.. కానీ అమ్మడికి అస్సలు ఖాళీ లేదట.. కాల్షీట్లు లేవని వచ్చిన ఓ మంచి ఆఫర్‌ని తిరస్కరించిందట..
మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్.. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, హీరో కార్తీ వంటి స్టార్ హీరోహీరోయిన్లు నటిస్తున్నారు.
కీర్తి ఖాళీలేదనడంతో ఆమె ప్లేస్‌లో త్రిషని తీసుకుంది చిత్ర యూనిట్. కీర్తి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిన ఆ చిత్రాలు.. రజనీ కాంత్‌కు చెల్లెల్లిగా నటిస్తున్న అన్నాత్తే కాగా, మరొకటి సర్కారువారి పాట. మహానటి తర్వాత మంచి అవకాశాలు వచ్చినా ఒక్కటి కూడా హిట్ చిత్రాల ఖాతాలో పడలేదు.. మణిరత్నం చిత్రంలో వచ్చిన మంచి అవకాశాన్ని కీర్తి వదులుకుందని కొందరు ఆమెను విమర్శిస్తున్నవారు లేకపోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com