Keerthi Suresh : పెళ్లి కబురు చెప్పిన కీర్తి సురేష్

Keerthi Suresh :  పెళ్లి కబురు చెప్పిన కీర్తి సురేష్
X

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ పెళ్లి కబురు చెప్పేసింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న ఈ మహానటి రీసెంట్ గానే తన ప్రియుడు గురించి చెప్పింది. దాదాపు 15యేళ్లుగా తాము రిలేషన్ ఉన్న విషయం చెప్పి షాక్ ఇచ్చింది. అతను ఇండస్ట్రీకి చెందిన వాడు కాబట్టి.. ఇప్పటి వరకూ వీరి గురించి చిన్న వార్త కూడా రాలేదు. లేదా రాకుండా జాగ్రత్త తీసుకున్నారు అనుకోవచ్చు. అయితే ఇంకా కొన్నాళ్ల పాటు వీళ్లు రిలేషన్ లోనే ఉంటారు అని భావించారు చాలామంది. బట్ సడెన్ గా పెళ్లి కబురు కూడా చెప్పి కుర్రాళ్ల గుండెలు బద్ధలు కొట్టింది కీర్తి సురేష్.

తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది శ్రీ లీల. అక్కడే తను వచ్చే నెలలో గోవాలో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చెప్పింది. పెళ్లి చేసుకోబోతున్న కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చానని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో కాబోయే వాడితో కలిసి వస్తారు. బట్.. కీర్తి పెళ్లి చేసుకోబోతోన్న వ్యక్తి క్రిస్టియన్. అందుకే తను రాలేదేమో అనుకోవచ్చు.

ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ అనే హిందీ మూవీ డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ఈ మూవీ కోసం ఇన్నాళ్లుగా చాలా పద్ధతిగా కనిపించిన కీర్తి బోల్డ్ గా నటించింది. ఇది కాక తమిళ్ లో రివాల్వర్ రాణి, కన్నివేడి అనే మరో రెండు సినిమాలున్నాయి తన ఖాతాలో. మొత్తంగా మహానటి పెళ్లి కబురు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story