Keerthi Suresh : ఫుల్ మాస్ అవతార్ లో కీర్తి సురేష్

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ను మాత్రం ఆపడం లేదు. ఇటు రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ త పాటు ఇలా తనే మెయిన్ లీడ్ లో కనిపిస్తూ అలరిస్తూ వస్తోంది. కొన్నాళ్ల క్రితం ఓటిటి కోసం మొదలైన తన సోలో పర్ఫార్మెన్స్ లు ఇప్పుడు థియేటర్స్ వరకూ వచ్చాయి. తాజాగా తను మరో లేడీ ఓరియంటెడ్ మూవీతో వస్తోంది. టైటిల్ లోనే మాస్ ఉన్న ఈ మూవీ పేరు .. ‘రివాల్వర్ రీటా’. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో రివాల్వర్ రాణి అంటూ కంగనా రనౌత్ ఓ సినిమా చేసింది. టైటిల్ ఆ సౌండింగ్ లో ఉన్నా ఈ కంటెంట్ లో కామెడీ కనిపిస్తోంది.. యాక్షనూ ఉంది.
తాజాగా మహానటి బ్యూటీ బర్త్ డే సందర్భంగా రివాల్వర్ రీటా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే .. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని కూరగాయల మార్కెట్ లో షాపింగ్ చేస్తోన్న కీర్తి సురేష్ బ్యాగ్ ను కార్లో వచ్చిన దొంగలు కొట్టేస్తారు. వారి డెన్ కు వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేస్తే.. అందులో ఓ రివాల్వర్, రక్తం మరకలున్న ఓ కత్తి.. అలాగే ఓ బాండ్ ఉంటాయి. ఇవన్నీ చూసి వాళ్లు షాక్ అయ్యే లోపే.. షట్టర్ బద్దలు కొట్టుకుని వస్తుంది కీర్తి. వారి వద్దకు వెళ్లి అవన్నీ ఇమ్మంటుంది.. దానికి వాళ్లు అండర్ కవర్ పోలీస్ వా, రా ఏజెంట్ వా లేక డాన్ వా అని అడుగుతారు.. అన్నిటికీ నేనా.. పోరారేయ్.. అన్నట్టుగా సమాధానం చెప్పిన తను అవన్నీ తీసుకుని బ్యాగ్ లో పెట్టేస్తుంది. అప్పుడే ఇంటి నుంచి ఫోన్.. కూరగాయలకు వెళ్లి ఇంత సేపవుతుంది ఎక్కడికి పోయావు అంటూ తల్లి అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉన్న షాట్స్.
కీర్తితో పాటు రాధిక, అజయ్ ఘోష్, సునిల్, జాన్ విజయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుధాన్ సుందరం, జగదీష్ పళని స్వామి నిర్మిస్తున్నారు. జేకే చంద్రు దర్శకుడు.
చూస్తుంటే ఈ సారి కీర్తి సురేష్ డిజప్పాయింట్ చేయదు అనిపించేలా ఉందీ టీజర్. చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తోంది. మరి ఈ రివాల్వర్ రీటా బాక్సాఫీస్ ను పేల్చేస్తుందేమో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com