Keerthy Suresh 'Gandhari': కీర్తి సురేష్ డ్యాన్స్ వీడియో.. 'గాంధారి' లుక్స్ వైరల్

Keerthy Suresh Gandhari: కీర్తి సురేష్ డ్యాన్స్ వీడియో.. గాంధారి లుక్స్ వైరల్
X
Keerthy Suresh 'Gandhari': ఈ ప్రైవేట్ సాంగ్‌ని పవన్ సిహెచ్ కంపోజ్ చేసారు. బృందా కొరియోగ్రఫీ చేసారు.

Keerthy Suresh 'Gandhari': కీర్తి సురేష్ తొలి మ్యూజిక్ వీడియో 'గాంధారి' విడుదలైంది. కీర్తి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. లెహంగాను ధరించి మంచి ఎనర్జీతో చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ తన మొదటి మ్యూజిక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ దానికి క్యాప్షన్ ఇచ్చింది, "ఈ ప్రాజెక్ట్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది! గాంధారీని మీకు అందిస్తున్నాను! అని పోస్ట్ చేసింది.

జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ మొదటి మ్యూజిక్ వీడియో ఇది. ఈ ప్రైవేట్ సాంగ్‌ని పవన్ సిహెచ్ కంపోజ్ చేసారు. బృందా కొరియోగ్రఫీ చేసారు. కీర్తి సురేష్ సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

సర్కారు వారి పాట మే 12న థియేటర్లలో సందడి చేయనుంది. కీర్తి సురేష్, మహేష్ బాబు కలిసి నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story