Keerthi Suresh : బాలీవుడ్ లో కీర్తిసురేశ్ బిజీ

బాలీవుడ్లో బిజీ అయిపోతోంది మరో సౌతిండియన్ యంగ్ హీరోయిన్. కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఎన్నో మూవీస్ లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
రీసెంట్ గా చిరంజీవి సరసున చెల్లెలి క్యారెక్టర్ చేసింది ఈ అమ్మడు. వాల్తేరు వీరయ్య మూవీలో చెల్లెలు క్యారెక్టర్ లో చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల రఘుతాత చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ కథనాయిక కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులోనే నటిస్తున సినిమా ఏది సెట్స్ మీద లేదు. ఒకప్పుడు తెలుగులో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా వున్న కీర్తికి వరుస ఫ్లాపులు రావటంతో టాలీవుడ్ లో కాస్త జోరు తగ్గింది.
ఇక 'మహానటి' చిత్రంలో ఉత్తమ నటనకు జాతీయ పురస్కారం అందుకున్న ఈ బ్యూటీ హవా ఇప్పుడు బాలీవుడ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ చిత్రానికి జవాన్ దర్శకుడు, కీర్తి సురేష్ స్నేహితుడు అట్లీ కూడా నిర్మాతగా వహిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com